బకాయి చెక్కును మంజూరు చేసేందుకు లంచం డిమాండ్…పట్టుకున్న ఏసీబీ అధికారులు
హరితహారం ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసినందుకు గాను ఫిర్యాదుదారునికి రావాల్సిన రూ. 5,09,000/- బకాయి చెక్కును మంజూరు చేసేందుకు రూ. 15,000/- లంచం డిమాండ్ చేసి, బోథ్ రేంజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎస్. పరశురాం ద్వారా ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) టి. ప్రణయ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద హరితహారం ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసినందుకు గాను ఫిర్యాదుదారునికి రావాల్సిన రూ. 5,09,000/- బకాయి చెక్కును మంజూరు చేసేందుకు రూ. 15,000/- లంచం డిమాండ్ చేసి, బోథ్ రేంజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎస్. పరశురాం ద్వారా ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని అధికారులు తెలుపుతున్నారు.



