గర్భిణీలు ఆరోగ్య రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత. ఎంఎల్ఏ.

గర్భిణీలు ఆరోగ్య రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత. ఎంఎల్ఏ. తల్లి ఆరోగ్యంతోనే బిడ్డకు ఆరోగ్యం ,జిల్లా కలెక్టర్. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయుష్ ఉచిత మెడికల్ క్యాంప్. మత్స్యకారులకు ఉచిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. గర్భస్థ పిండ లింగార్చన పరీక్ష చట్ట నిత్య నేరం, వైద్య అధికారి. జిల్లా ఆస్పత్రి పారిశుధ్యం పై ఎం ఎల్ ఏ సీరియస్. వైద్య విద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత. ఎమ్ ఎల్ ఏ.

గర్భిణీలు ఆరోగ్య రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత. ఎంఎల్ఏ.

తల్లి ఆరోగ్యంతోనే బిడ్డకు ఆరోగ్యం ,జిల్లా కలెక్టర్.

శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయుష్ ఉచిత మెడికల్ క్యాంప్.

మత్స్యకారులకు ఉచిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.

గర్భస్థ పిండ లింగార్చన పరీక్ష చట్ట నిత్య నేరం, వైద్య అధికారి.

జిల్లా ఆస్పత్రి పారిశుధ్యం పై ఎం ఎల్ ఏ సీరియస్.

వైద్య విద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత.
ఎమ్ ఎల్ ఏ.

భూపాలపల్లి, మహాదేవపూర్: ఏప్రిల్ 8 (నిజం న్యూస్)

గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు. ప్రజా పరాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన , సేఫ్ మదర్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేఫ్ మదర్ డే కార్యక్రమం ద్వారా గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షల పై అవగాహన పెంపొందిస్తుందని పేర్కొన్నారు, గర్భధారణ అనంతరం వైద్య సేవలు పోషక విలువలు కలిగిన ఆహారం, జన్మించిన శిశువు తల్లి పాలు అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయికి ఎదిగేలా తీసుకు వెళ్లడం జరుగుతుందని, త్వరలో ఎంఆర్ఐ యంత్రాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.

తల్లి ఆరోగ్యంతోనే బిడ్డకు ఆరోగ్యం ,జిల్లా కలెక్టర్.

సేఫ్ మదర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, తల్లి బిడ్డ ఆరోగ్యంతో ఉండడం ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబం మరియు సమాజ నిర్మాణానికి సాధ్యమవుతుందని అన్నారు, గర్భ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అవసరమైన వైద్య పరీక్షల పై అవగాహన కల్పించడం సేఫ్ మదర్ డే ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ తెలిపారు, హెల్త్ వీక్ కార్యక్రమం ద్వారా ఆశ వర్కర్లు మరియు అలాగే వైద్యులు గ్రామీణ స్థాయి ప్రజల వరకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం తో హెల్త్ వీక్, సేఫ్ మదర్స్ డే కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయుష్ ఉచిత మెడికల్ క్యాంప్.

  1. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, శుక్రవారం 10వ తేదీ రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని డి ఈ సి భవనంలో, ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవి, ఆదేశాల తో ఉచిత ఆయుష్, ఆయుర్వేదిక్ యునాని హోమియోపతి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ తనూజ రాణి తెలిపారు. ఉదయం 6:30 నుండి, 7:30 వరకు ఇల్లందులో యోగా శిబిరం నిర్వహించడం జరుగుతుందని. ఈ ఆయుష్ క్యాంపులో దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఆర్థరైటిస్ గ్యాస్ట్రిక్ సమస్యలు కిడ్నీ సంబంధిత వ్యాధులు శర్మ వ్యాధులు రక్తపోటు మధుమేహం వంటి వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించడంతోపాటు, మందులను అందించడం జరుగుతుందని జిల్లా ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ వైద్య అధికారి తనుజరాణి కోరడం జరిగింది.

మత్స్యకారులకు ఉచిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నృత్యకారుడు మత్స్య కార్మికులు అలాగే మత్స్య రైతులు, జాతీయ మత్స్య అభివృద్ధి మరియు ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకం లో భాగంగా, డిజిటల్ ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకొని, రిజిస్టర్ సర్టిఫికెట్ పొందాలని జిల్లా అధికారి, విజయ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మత్య కారులకు సంబంధించి, చేపల పెంపకం అలాగే చేపల అమ్మకం ఫుడ్ ప్రాసెసింగ్, చేపల వృత్తిపై ఆధారపడిన ఇతర వివరాలు నమోదు చేసుకొని, ఆధార్ కార్డు తో పాటు మొబైల్ నెంబర్ సభ్యుని బ్యాంక్ ఖాతా వివరాలు చేపల వృత్తి కు సంబంధించిన ధ్రువీకరణ పత్రంతో, ఎన్ ఎఫ్ డి పి. డి ఓ ఎఫ్. జి ఓ వి. ఇన్ హోటల్లో వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందగలరని, యొక్క సర్టిఫికెట్ పొందిన మత్స్యకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక పథకాలకు అర్హత పొంది, లబ్ధి పొందుటకు ఉపయోగపడుతుందని తెలిపారు.

గర్భస్థ పిండ లింగార్చన పరీక్ష చట్ట నిత్య నేరం, వైద్య అధికారి.

లింగ నిర్ధారణ చట్టనిత్య నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గర్భ స్థానం పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం పిసిపి ఎన్డిటి యాక్ట్ అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి స్కానింగ్ కేంద్రాల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే పదివేల జీరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు, జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలకు ఈ సూచన తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు, స్కానింగ్ కేంద్రాల్లో వైద్యుల వివరాల నమోదు చేయాలని, గర్భిణీ స్త్రీలకు సంబంధించి వసతులు స్కానింగ్ సెంటర్లలో ఏర్పాటు చేయాలని. లింగ నిర్ధారణకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని. లింగ నిర్ధారణ పై ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు జిల్లా వైద్య అధికారి మధుసూదన్. ఈ కార్యక్రమంలో పిఓ డాక్టర్ శ్రీదేవి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్ డాక్టర్ సుధాకర్ డాక్టర్ సంధ్య ఎన్జీవో ప్రతినిధి శ్యాంప్రసాద్ డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఆస్పత్రి పారిశుధ్యం పై ఎం ఎల్ ఏ సీరియస్.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహించారు. బుధవారం రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సందర్శించి సమగ్ర పరిశీలన చేశారు అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్ ఎంఆర్ఐ అవుట్ పేషంట్ గదులను పరిశీలించారు. వైద్య సేవలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అత్యంత సమయంలో రోగులకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు తెలుపగా 15 బెడ్లను నిర్మాణం చేపడతామని వాటికి సంబంధించిన ప్లానింగ్ అంచనా తయారు చేసి ఇవ్వాలని పి జి ఎం ఐ డి సి అధికారి లకు ఆదేశించారు అనంతరం ఆసుపత్రి ల్యాబ్ను పరిశీలించి అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో వార్డులు మరియు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం గమనించిన శాసనసభ్యుడు గంట సత్యనారాయణ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడం విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైద్యంపై నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. పేద ప్రజలకు వైద్య సదుపాయంలో ఎలాంటి జాప్యం మరియు వైద్యుల నిర్లక్ష్యం సహించేది లేదని, కఠిన చర్యలు అమలు చేస్తామని స్పష్టం చేశారు ఎంఎల్ఏ, అనంతరం ఆసుపత్రిలోని క్యాంటీన్లో శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు అలాగే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, క్యాంటీన్లోని టిఫిన్ సెంటర్లో తయారుచేసిన వంటలను తిని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

వైద్య విద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత.
ఎమ్ ఎల్ ఏ.

ప్రభుత్వం వైద్య మరియు విద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, బుధవారం జిల్లా కలెక్టర్ తో కలిసి జంగేడు గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, ప్రహరీ గోడ, మౌలిక వసతుల కల్పన కోసం 38 లక్షల వ్యయంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని జంగేడు ఘన్పూర్ రేగొండ టేకుమట్ల మండలాల్లో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకుల అభివృద్ధికి రెండు కోట్ల 38 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వేసవి సెలవులు పూర్తయి తిరిగి పాఠశాల ప్రారంభానికి అన్ని వసతుల నిర్మాణ పనులు పూర్తయి అందుబాటులోకి వస్తాయని తెలిపారు శాసనసభ్యులు. వచ్చి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం మరియు పాఠ్య పుస్తకాలు, అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని అన్నారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలకు యూనిఫామ్ మరియు పుస్తకాలు అలాగే షూస్ లను అందజేయనున్నట్లు తెలిపారు విద్యార్థులు కష్టం తూ కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button