డిసిఎం , బొలెరోలు ఢి …ఇద్దరు అక్కడికక్కడే…
దురాజ్ పల్లి గట్టుకు వెళ్తుండగా వారి వాహనాన్ని తెల్లవారు జామున డీసీఎం బలంగా ఢీకొట్టింది.

మేళ్లచెరువు, ఏప్రిల్ 8.నిజం చెపుతాం న్యూస్
సూర్యాపేట పట్టణ శివారులో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మేల్లచెరువుకు చెందిన ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మేళ్లచెరువుకు చెందిన 20 మంది భక్తులు బొలెరోలో దురాజ్ పల్లి గట్టు కు దర్శనానికి వెళ్తుండగా వారి వాహనాన్ని తెల్లవారు జామున డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సతీశ్ (25), నర్సింహారావు (36) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు



