నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమవడం దారుణం
చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయని, అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన కోరారు.

ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరమని సీపీ సజ్జనార్ అన్నారు.
తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారన్నారు.
చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయని,
అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన కోరారు.
ముఖ్యంగా పరీక్షల ఫలితాల విషయంలో వారికి కొండంత భరోసానిస్తూ, వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు.



