అంబేద్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ గా రామయ్య.
జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు మండలం లోని కుల సంఘాలు అంబేద్కర్ వాదుల సమక్షంలో ఉత్సవ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఉత్సవ కమిటీ కన్వీనర్ గా జాతీయ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు లింగాల రామయ్య, ను ఎన్నుకున్నారు.

అంబేద్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ గా రామయ్య.
మహాదేవపూర్: (నిజం న్యూస్)
భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు మండలం లోని కుల సంఘాలు అంబేద్కర్ వాదుల సమక్షంలో ఉత్సవ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఉత్సవ కమిటీ కన్వీనర్ గా జాతీయ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు లింగాల రామయ్య, ను ఎన్నుకున్నారు. అలాగే ఉప అధ్యక్షునితోపాటు ఇద్దరు కార్యదర్శులు 22 మంది కార్యవర్గ సభ్యులు, కుల మతాలకు అతీతంగా ఉత్సవ కమిటీ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ రామయ్య మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత జన్మదిన వేడుకల కార్యక్రమానికి కుల సంఘాలు అంబేద్కర్ వాదులు తనకు, ఈ అవకాశం ఇవ్వడం ఎన్నటికీ వారి రుణం తీర్చుకోలేనని అన్నారు. 14వ తేదీ జరగబోయే అంబేద్కర్ జన్మదిన కార్యక్రమానికి సభ్యులందరూ, కష్టపడి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, కార్యక్రమం విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.



