ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అప్పులు చేయవద్దు….స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకోవాలి

స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చి 26 (నిజం చెపుతాం)
గురువారం జిల్లా కలెక్టర్ గోపాలపేట మండల పరిధిలో బుద్ధారం గ్రామాన్ని సందర్శించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో గతంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికే మంజూరు చేసిన ఈ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను త్వరగా గుర్తించాలని తహసిల్దార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని ఆదేశించారు.
లబ్ధిదారులకు త్వరలోనే పట్టాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో గతంలో కొందరు అకతవకలకు పాల్పడ్డారని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణం కోసం ఎవరితోనూ అప్పులు చేయవద్దని సూచించారు.
ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక అవసరం ఉంటే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.



