సర్పంచుల హక్కుల కోసం ఐక్య పోరాటం…గ్రామ పంచాయతీల నిధుల ఫ్రీజ్ను ఎత్తివేయాలని డిమాండ్

– జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి ఎన్నిక
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:మార్చి 25(నిజం చెపుతాం)
గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో బుధవారం నిర్వహించిన సర్పంచుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన,ప్రస్తుతం వారు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
సర్పంచుల వేతనాలను 6,500 నుంచి ₹25 వేల రూపాయల వరకు పెంచాలని, గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల ఫ్రీజ్ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా సర్పంచుల ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



