రహదారి లేక ఎమ్-2 ఇసుక రవాణా నిలిపివేత
భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని నిర్వహించబడిన మహాదేవపూర్ రెండు, ఇసుక క్వారీ, డంపింగ్ యార్డ్ నుండి ఇసుక రవాణాకు రహదారి సౌకర్యం లేక, మూడు రోజులుగా క్వారీ లో ఇసుక నిర్వహణ నిలిపివేయడం జరిగింది

మహాదేవపూర్,భూపాలపల్లి;మార్చి 26 (నిజం న్యూస్)
భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని నిర్వహించబడిన మహాదేవపూర్ రెండు, ఇసుక క్వారీ, డంపింగ్ యార్డ్ నుండి ఇసుక రవాణాకు రహదారి సౌకర్యం లేక, మూడు రోజులుగా క్వారీ లో ఇసుక నిర్వహణ నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో ఇసుక క్వారీల నిర్వహణతో రో
జుకు 120 గ్రామస్తులకు పొందడం జరుగుతుంది, ఎమ్2 ఇసుక క్వారీ మంగళవారం నుండి ఇసుక రవాణా నిలిపివేయడంతో ఈ క్వారీ పై ఆధారపడ్డ రోజువారీ 40 కుటుంబాలు ఉపాధి లేకుండా పోయింది, మరోవైపు ఈ ఇసుక క్వారీ నిర్వహణలో 100కు పైచిలుకు లారీల్లో ఇసుక రవాణా తో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం లేకుండా పోయింది.



