ఐదేళ్ల చిన్నారి పై ఇద్దరు మైనర్ల అఘాయిత్యం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో, ఐదు సంవత్సరాల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలుర్లు, హత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది

మహా మండలంలో దారుణం, చిన్నారిపై అత్యాచారం.

 

మహాదేవపూర్, భూపాలపల్లి, మార్చ్ 24 (నిజం న్యూస్)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో, ఐదు సంవత్సరాల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలుర్లు, హత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

మండల కేంద్రానికి చెందిన ఓ చిన్నారి ఆదివారం రోజు ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో, మండల కేంద్రానికి చెందిన ఏడవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ లు ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని, సమీపంలోని పాఠశాల మైదానంలో ఒక స్కూల్ లో తీసుకువెళ్లి, చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఉదయం సుమారు 10:30 గంటలకు చిన్నారిని తీసుకువెళ్లిన మైనర్లు సుమారు నాలుగు గంటల వరకు, చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తూ అఘాయిత్యానికి పాల్పడి, చివరికి మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో, చిన్నారి ఇంటి వద్ద వదిలి వెళ్ళినట్లు తెలుస్తుంది.

ఇంట్లో వెళ్లిన చిన్నారి భరించలేని కడిపినొప్పి రావడంతో, తల్లిదండ్రులకు తెలుపగా ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో, చిన్నారి అఘాయిత్యానికి గురైందని బయటపడింది.

తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇద్దరు మైనర్లకు అదుపులోకి తీసుకొని పోస్కో చట్టం నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారి భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button