అక్రమ పౌతీ… మేళ్లచెర్వు డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్..!
రెవెన్యూ నిబంధనలకు విరుద్ధంగా, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్రమంగా పౌతీ (వారసత్వ మార్పిడి) చేసిన మేళ్లచెర్వు డిప్యూటీ తహశీల్దార్ శ్రీధర్ నాయక్ పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెన్షన్ వేటు వేశారు

రెవెన్యూ నిబంధనలకు విరుద్ధంగా, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్రమంగా పౌతీ (వారసత్వ మార్పిడి) చేసిన మేళ్లచెర్వు డిప్యూటీ తహశీల్దార్ శ్రీధర్ నాయక్ పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెన్షన్ వేటు వేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలు అతిక్రమించినా సహించేది లేదని ఈ చర్య ద్వారా కలెక్టర్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
మేళ్లచెర్వు మండలంలో ఒక భూమికి సంబంధించి వారసత్వ మార్పిడి (సక్సెషన్) ప్రక్రియలో నిబంధనలు తుంగలో తొక్కారు. కుటుంబ సభ్యులందరి అంగీకారం ఉండాలని చట్టం చెబుతున్నప్పటికీ, వారి అనుమతి లేకుండానే అక్రమంగా పౌతీ చేసినట్లు విచారణలో తేలింది.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కలెక్టర్, ప్రాథమిక ఆధారాలను పరిశీలించి నాయబ్ తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు, ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై ఆయన జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ రికార్డుల విషయంలో పారదర్శకత పాటించని పక్షంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.



