INDIRAMMA INDLU: ఇండ్ల కేటాయింపులో పారదర్శకత ఇదేనా..? ఉత్తమ్ సాబ్ జర దేఖో

బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇండ్లను కేటాయిస్తామని అధికారులు చెపుతున్నా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. 28 వార్డుల్లో ప్రతీ వార్డులో కౌన్సిలర్లు, కాంగ్రేస్ నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారు పొలాలున్న, ఇండ్లున్నా, ఆస్తులున్నా సరే తమ వారికే ఇండ్లను కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మచ్చుకు ఒక ఉదాహరణ ఇదే.

8 వ వార్డులో కౌన్సిలర్ తల్లికి, 16వ వార్డులో కౌన్సిలర్ కు ఇండ్లను కేటాయించిన అధికారులు ..?

ఇందిరమ్మ ఇళ్లలో సీనియర్ జర్నలిస్ట్ ‘చేతి’వాటం…!

మంత్రి ఉత్తమ్ మార్గదర్శకాలకు తూట్లు..!

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 ఇందిరమ్మ సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులకే ఇండ్లు దక్కాలని అవకతవకలు జరగకూడదు అని అధికారులను పదేపదే హెచ్చిరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండ్లు ఉన్న వారికి ఇండ్లను కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇండ్లను కేటాయిస్తామని అధికారులు చెపుతున్నా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. 28 వార్డుల్లో ప్రతీ వార్డులో కౌన్సిలర్లు, కాంగ్రేస్ నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారు పొలాలున్న, ఇండ్లున్నా, ఆస్తులున్నా సరే తమ వారికే ఇండ్లను కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మచ్చుకు ఒక ఉదాహరణ ఇదే.

8 వార్డు కౌన్సిలర్  ఒకటి, ఆమె తల్లికి మరొకటి….

పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్ తల్లికి అప్లికేషన్ నంబర్ 1775 లో ఇంటిని మంజూరీ చేసారు. కౌన్సిలర్ తల్లికి స్వంత ఇల్లు ఉంది. కాని రెంట్ ఇల్లు అని చూపుతున్నారు.  అలాగే 16వ వార్డులో కౌన్సిలర్ కు అప్లికేషన్ నెంబర్ 2804 లో ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కేటాయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈమె పేరు మీద రూ. 50 లక్షల విలువ చేసే ఆస్తులున్నట్లుగా తెలుస్తోంది.

కౌన్సిలర్ తండ్రికి జర్నలిస్ట్ కోటా క్రింద గత ప్రభుత్వ హయాంలోనే 140 గజాల ఇంటి స్థలం కేటాయించడం విశేషం.  అధికారంను అడ్డం పెట్టుకుని, జర్నలిస్టు ముసుగులో అధికారులపై ఒత్తిడి తెచ్చి అర్హుల జాబితాలో తన కుటుంబం పేర్లు చేర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక్కొక్క ఇల్లుకు 50 వేల నుండి లక్ష రూపాయలు వసూలు ..!

సీనియర్ జర్నలిస్ట్ తన 8 వార్డులో, మిగిలిన 28 వార్డులలో కొంత మంది నాయకులు ఇల్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజల నుండి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. 28 వార్డుల పరిధిలో సుమారు 200 నుండి 300 మంది బాధితుల నుండి ఒకొక్కరి వద్ద నుండి రూ. 50 వేల నుండి లక్ష వరకు వసూలు చేసినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

నిరుపేదల ఆవేదన..!

“ఒకవైపు ఇళ్లు లేక, అద్దెలు కట్టలేక మేం రోడ్డున పడుతుంటే.. ఇప్పటికే స్థలాలు, హోదా ఉన్నవారికే ఇళ్లు కేటాయించడం ఎంతవరకు ధర్మం?” అని నిరుపేద లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తూ, ముడుపులకు లొంగి అనర్హులకు కట్టబెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, రాజకీయ పలుకుబడితో ఇళ్లు పొందిన వారిని తొలగించి, నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమాలపై మంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button