డెక్కన్ cement ఆక్రమణలపై 16న C.E.C ఎదుట విచారణ
ఆటవీభూమికి, మరియు డెక్కన్ సిమెంట్ వారి భూములకు మధ్య ఖచ్చితంగా ఉండవలసిన హద్దులే లేవని, వాటిని తొలగించివేయడమే కాకుండా వారికి ఇష్టమొచ్చినట్టుగా స్థాన భ్రమనం చేస్తున్నారని పేర్కొన్నారు.

డెక్కన్ సిమెంట్ ఆటవీభూముల ఆక్రమణల వివాదంపై ఈరోజు విచారణ చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి అటవీ శాఖకు సంబంధించిన అధికారుల బృందాలు.
మరొకమారు ఈనెల 16వ తారీకున C.E.C ఎదుట విచారణ జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నివేదిక సమర్పించవలసి వుంది

ఇందుకు సంబంధించి ఇప్పటికే సూర్యాపేట జిల్లా D.F.O (V.సతీష్ కుమార్) ఈనెల 9వ తారీకున క్షేత్ర స్థాయి విచారణ జరిగినప్పటికీ, పిర్యాదు దారుడు పసుపులేటి సురేష్ బాబు మాత్రం అటవీ అధికారులు ఎక్కడా కూడా డెక్కన్ సిమెంట్ చేస్తున్న అటవీ ఆక్రమణల గురించి C.E.C ఆదేశించిన విధంగా కాకుండా నిజాలను దాచిపెడుతూ నామమాత్రంగానే నిర్వహించారు అని ఆరోపించారు.
ఐతే పిర్యాదు దారు పేర్కొన్న విధంగా ఆటవీభూమికి, మరియు డెక్కన్ సిమెంట్ వారి భూములకు మధ్య ఖచ్చితంగా ఉండవలసిన హద్దులే లేవని, వాటిని తొలగించివేయడమే కాకుండా వారికి ఇష్టమొచ్చినట్టుగా స్థాన భ్రమనం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇవన్నీ సదరు D.F.O ప్రత్యేకంగా చేసినప్పటికీ పిర్యాదు దారుడికి సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోగా ఆ హద్దు రాళ్లు ఉంటే డెక్కన్ సిమెంట్ వారి కార్యకలాపాలకు ఇబ్బందులు ఉన్నాయని కనుక అక్కడ ఉండవలసిన హద్దురాళ్ళని తొలగించారని చెప్పడం మరీ విచిత్రంగా ఉందన్నారు.
ఇంతేకాక ఆటవీభూములలో ఆక్రమణ మరింత విస్తీర్ణంలో ఉన్నప్పటికీ తనకి సంబంధం లేదని అనడం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు,



