మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షలను ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్…పట్టుకున్న ఏసీబీ అధికారులు
మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 18,000/- లంచం డిమాండ్ చేశారు.

కూకట్‌పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్-53 కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 18,000/- లంచం డిమాండ్ చేశారు.
బాధితుడి నుండి కె. మురళి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలుపుతున్నారు.



