డెక్కన్ సిమెంట్ పై క్షేత్ర స్థాయి విచారణకు కదిలిన రాష్ట్ర అటవీశాఖ అధికారులు

జిల్లా అటవీ సంరక్షణ అధికారి వి.సతీష్ కుమార్ పిర్యాదు దారుడు పసుపులేటి సురేష్ బాబు సమక్షంలో ఈనెల 9వ తారీకు ఉదయం 11 గంటలకు డెక్కన్ సిమెంట్ యాజమాన్యం సంబంధిత అన్ని రకాల ఆధారాలతో విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించి అధికారిక ఉత్త్వర్వులు జారీ చేయడం జరిగింది.

సుర్యాపేట జిల్లా, పాలకీడు మండలం పరిధిలోని డెక్కన్ సిమెంట్ ఆటవీభూమి ఆక్రమణ విషయంలో సుప్రీంకోర్టు పరిధిలోని Central Empowered Committee ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి విచారణకు కదిలిన రాష్ట్ర అటవీశాఖ అధికారులు ,

 

ఈమేరకు జిల్లా అటవీ సంరక్షణ అధికారి వి.సతీష్ కుమార్ పిర్యాదు దారుడు పసుపులేటి సురేష్ బాబు సమక్షంలో ఈనెల 9వ తారీకు ఉదయం 11 గంటలకు డెక్కన్ సిమెంట్ యాజమాన్యం సంబంధిత అన్ని రకాల ఆధారాలతో విచారణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించి అధికారిక ఉత్త్వర్వులు జారీ చేయడం జరిగింది.

ఇదిలా వుండగా క్షేత్రస్థాయి విచారణ సమయంలో డెక్కన్ సిమెంట్ యాజమాన్యం విచారణ సజావుగా జరగకుండా ఉండడానికి తనపై భౌతిక దాడికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కనుక తనకు తగిన రక్షణ కల్పించాలని సంబంధిత పోలీసు శాఖ వారిని పిర్యాదు దారుడు పసుపులేటి సురేష్ బాబు కోరనున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button