కారు చిచ్చు వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం మహాదేవపూర్ రేంజ్ పరిధిలోని నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో, బుధవారం జాతీయ రహదారి ని ఆనుకుని ఉన్నటువంటి అటవీ ప్రాంతం లో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగి కారు చిచ్చు గా వ్యాప్తించి, సుమారు రోడ్డు పొడుగునా వంద మీటర్ల వరకు, మంటలు కొనసాగడం, అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం, అటవీ శాఖ అధికారులు మంటలు ఆర్పినట్లు తెలుస్తోంది.

కొమ్మకు” బదులు “కారు చిచ్చునా.!?

నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో భారీ మంటలు, అసలు రహస్యం.!?

ఫిబ్రవరి మార్చ్ నెలలోనే ఎందుకు కారు చిచ్చు.!?

అటవీ సంరక్షణకు ఫైర్ బ్రిగెడార్, ఎందుకు లేదు,గత సంవత్సరం నో ఫైర్ వాచర్స్.!?

మహదేవ్ రేంజ్ పరిధిలో కొమ్మను మరిచిపోయి, కారు చిచ్చు లే ఎక్కువ.!?

కాలేశ్వరం జూన్ పరిధిలో తునికి ఆకు సేకరణ మహదేవ్పూర్ టాప్.

అటవీ శాఖ నిర్లక్ష్యం, అంతర్గత ఒప్పందంతోనే కారు చిచ్చు.?

మహాదేవపూర్,భూపాలపల్లి:మార్చ్ 5 (నిజం న్యూస్)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం మహాదేవపూర్ రేంజ్ పరిధిలోని నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో, బుధవారం జాతీయ రహదారి ని ఆనుకుని ఉన్నటువంటి అటవీ ప్రాంతం లో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగి కారు చిచ్చు గా వ్యాప్తించి, సుమారు రోడ్డు పొడుగునా వంద మీటర్ల వరకు, మంటలు కొనసాగడం, అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం, అటవీ శాఖ అధికారులు మంటలు ఆర్పినట్లు తెలుస్తోంది.

జాతీయ రహదారి 24 గంటలు వాహనాలు రాకపోకలు, కారు చిచ్చు చెలరేగిన ప్రాంతం నుండి కొద్ది దూరంలోనే, నస్తురు పెళ్లి గ్రామం, మరోవైపు జాతీయ రహదారికి రెండు భాగాల్లో, దట్టమైన అడవి, వాహనాల రాకపోకలే తప్ప జనసంచారం ఉండని ప్రదేశం, కానీ అక్కడ మంటలు చెలరేగి సుమారు 100 మీటర్ల వరకు కారు చిచ్చు ఏర్పడడం, వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి.

ఫిబ్రవరి మార్చ్ నెలలోనే కారు చిచ్చు ఎందుకు పడుతుంది, ప్రధాన రహదారి 24 గంటల పాటు వాహనాల రాకపోకలు, కొనసాగుతున్న నష్టూరు పెళ్లి జాతీయ రహదారి పై ఇలా భారీ మంటలు చెలరేగితే, మిగతా అటవీ ప్రాంతాల పరిస్థితి ఏమిటి, ఇది కారు చిచ్చు తగిలిందా, లేక కొమ్మకు బదులు, అడవిలో తునికి చెట్ల ఇగురు కొరకు, కారు చిచ్చు పెట్టడం జరిగిందా, ఇలా అనేక అనుమానాలను వ్యక్తం పరుస్తున్నారు ప్రజలు. కానీ కొందరు ఇది వాస్తవం అని కూడా అంటున్నారు.

నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో భారీ మంటల, అసలు రహస్యం.!?

నస్తురుపల్లి అటవీ ప్రాంతం జాతీయ ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో రోడ్డు పై నుండి మంటలు అటవీ ప్రాంతం లోపలికి వెళ్లడం, మరోవైపు రోడ్డుకు ఆనుకొని 100 మీటర్ల దూరం పొడవు, మంటలు కొనసాగడం, అక్కడ ఇలాంటి వ్యక్తులు లేదా ఇతరులు, అగ్గి లేదా మరేమైనా మంటలు వ్యాప్తించే పదార్థాలు,తో కారు చిచ్చు పెట్టిన పరిస్థితి లేదు.

కానీ భారీగా మంటలు వ్యాప్తించడం ఇలా సంభవం. కాలేశ్వరానికి వచ్చే యాత్రికులు లేదా, మరి ఎవరైనా సేద తీర్చుటకు, అక్కడ వాహనాలను ఆపి ఏదైనా అగ్గి పెట్టారా అలాంటి ఆడవాళ్లు కూడా లేవు, అయినా మంటలు ఎలా పుట్టుకొస్తాయి, జాతీయ రహదారిపై చెలరేగిన భారీ మంటల వెనుక బలమైన రహస్యం దాగి ఉంది అనేది ప్రస్తుతం ఒక హార్ట్ టాపిక్ నడుస్తుంది.

ఫిబ్రవరి మార్చ్ నెలలోనే ఎందుకు కారు చిచ్చు.!?

అడవిలో మంటలు కారు చిచ్చు అనే విషయం కేవలం సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ నెలల్లోని, తెరపైకి వచ్చి సంఘటన ఇది, ఏప్రిల్ మేలు బలంగా ఇండ ప్రభావం కనబడుతుంది కానీ అప్పుడు మాత్రం “కారు చిచ్చు” ఉండదు, ఫిబ్రవరి మార్చ్ నెలలోనే అడవిలో మంటలు ఎందుకు, ఇది కారు చిచ్చు కాదు, అడవిలో మంటల వెనుక అసలైన రహస్యం దాగి అంటున్నారు ప్రజానికం.

సాధారణ వేడి ఉష్ణోగ్రత అప్పుడే కారు చిచ్చుపడి అసలైన ఏప్రిల్ మే నెలలో కారు చిచ్చు ఏర్పడదు, అటవీ ఉత్పత్తి కొనసాగుతున్న దశ కనుక అడవిలో మంటలు ఉండవని చెబుతున్నారు ప్రజలు. ప్రస్తుతం నస్తూరు పెళ్లి అటవీ ప్రాంతంలో చెలరేగిన భారీ మంటలు కారు చిచ్చు కాదు ఇది, అంతర్గత ఒప్పందంతో, అటవీ సంపదనకు ఉపయోగపడే వృక్షాలు, తిరిగి ఎక్కువ మోతాదులో, చిగురు వచ్చి, వారు అనుకున్న లక్ష్యాన్ని పెట్టుబడి లేకుండా సాధించుకొనుటకు, చేసే ప్రయత్నం అని చెబుతున్నారు పర్యావరణ ప్రేమికులు.

అటవీ సంరక్షణకు ఫైర్ బ్రిగెడార్, ఎందుకు లేదు,గత సంవత్సరం నో ఫైర్ వాచర్స్.!?

దట్టమైన అటవీ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో, అనుకోకుండా, అలాగే మరెవరి నుండైనా రోజువారి పనుల నిమిత్తం, అటవీలో వెళ్లే సందర్భం లేదా, దట్టమైన అటవీ ప్రాంత సమీపం నుండి వెళ్లిన క్రమంలో వారు వాడిన ప్రదార్థాల నుండి, అటవీలో మంటలు చెలరేగే సందర్భం ఉంటుందని, అటవీ శాఖ సంరక్షణ చట్టం ముందుగానే గుర్తించి, ఫిబ్రవరి చివరి వారం నుండి జూన్ మొదటి రెండు వారాల వరకు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన వాహనం ఏర్పాటుచేసి నలుగురు ఫైర్ బ్రైడర్లకు, అందుబాటులోకి తీసుకురావడం తీసుకువచ్చి నాలుగు నెలల పాటు, అటవిలో ఎలాంటి మంటలు చెల్లరేగకుండా ముందస్తు, పెట్రోలింగ్ చేస్తూ పర్యవేక్షించడం జరుగుతుంది.

కానీ మహాదేవపూర్ రింగ్స్ పరిధి దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో, ఫైర్ బ్రిగెదర్స్ మరియు ఒక ప్రత్యేక వాహనం, కేటాయించడం జరిగింది, కానీ గత సంవత్సరం నుండి ఇప్పటివరకు, ఫైర్ బ్రిగెదర్ లను ఏర్పాటు చేయకుండా, అటవీ శాఖ నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని, ఫిబ్రవరి చివరి దశ నుండి ఫైర్ వాహనం మరియు ఫైర్ క్రికెటర్స్ లను అందుబాటులోకి తీసుకురాకపోవడం, తుని నస్తూర్ పల్లి అటవీలో భారీ మంటలు చెలరేగడానికి కారణం అని చెబుతున్నారు మండలవాసులు.

మహదేవ్ రేంజ్ పరిధిలో కొమ్మను మరిచిపోయి, కారు చిచ్చు లే ఎక్కువ.!?

అడవిలో మంటల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం, వేరే ఉందని, కేవలం కారు చిచ్చు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందని, అంటున్నారు పర్యావరణ ప్రేమికులు, ఫిబ్రవరి నెల చివరి వారం నుండి మార్చి 3 వారాల వరకు, అటవీ ఉత్పత్తుల భాగంలో తునికి ఆకు సేకరణ, కొరకు సిద్ధమై, ఉత్పత్తి పెంపొందించుటకు, ఆయా యూనిట్లలో గ్రామస్తులు, చెట్ల కొమ్మలను, నరకడం అలాగే చెడిపోయిన భాగం వరకు తీసివేయడం, తో సుమారు 15 రోజుల్లో తిరిగి తునికి ఆకు చెట్లు, తిరిగి పురోగతి పొంది రెట్టింపు ఉత్పత్తిని ఇవ్వడం కొరకు, గ్రామస్తుల సమక్షంలో అటవీ అధికారుల పర్యవేక్షణలో కొమ్మ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించేవారు,

కానీ ఇప్పుడు అది మర్చిపోవడం, తునికి ఆకు ఉత్పత్తికి ముందు అడవిలో మంటలు చెలరేగడం దానికి కారు చిచ్చు పేరు ఇవ్వడం, కాంట్రాక్టర్లకు కొమ్మ కొట్టే గ్రామస్తులకు లక్షల రూపాయలు మిగిలింపు కొరకే, అడవిలో మంటలతో కారు చిచ్చు పేరును ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు, అటవీ సంపదపై ఆధారపడి ఉన్న ప్రజలు. కాలేశ్వరం జోన్ పరిధిలో అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైన, ఉత్పత్తి తునికి సేకరణ మొదటి స్థానంలో ఉంది,

సుమారు 19 స్టాండర్డ్ బ్యాక్ లను అందించడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం బుధవారం రోజు చెలరేగిన నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో భారీ మంటలు, కారు చిచ్చు కాదు, ఇప్పటికే రాష్ట్రంలో తునికి ఆకు సేకరణ కొరకు గత నెలలో టెండర్ల కార్యక్రమం పూర్తయి కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారని, నస్తూర్ పల్లి అటవీ ప్రాంతం, మహదేవ్పూర్ డివిజన్లోని, ఎలికేశ్వరం యూనిట్ పరిధిలో వస్తుందని, అటవీ శాఖ నిర్లక్ష్యం లేదా అంతర్గత ఒప్పందంతోనే మంటలు చెలరేగడం జరిగిందని, చెబుతున్నారు మహదేవ్పూర్ డివిజన్ పరిధిలోని ప్రజలు నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో భారీ మంటలపై పిసిసిఎఫ్ విచారణకు ఆదేశించాలని, చెబుతున్నారు పర్యావరణ ప్రేమికులు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button