నకిలీ బంగారం బిస్కెట్ల దందాలో బ్యాంక్ ఉద్యోగుల హస్తం ..?

స్థానిక జువెలరీ షాపుల యజమానుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ బిస్కెట్లను అసలైనవిగా ధృవీకరించడంలో వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కొందరు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ ముఠాతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వీరి సహకారంతోనే ఈ అక్రమ చలామణి యధేచ్ఛగా సాగుతోందని సమాచారం.

హుజూర్ నగర్ లో నకిలీ బంగారం బిస్కెట్ల దందా..?

నకిలీ బిస్కెట్ల వెనుక అసలు దొంగలెవరు?

జువెలరీ వ్యాపారుల హస్తం ఉందా..?

అధికారుల మౌనం.. నకిలీ బంగారం మాఫియాకు వరమా..?

వడ్డీ ఆశ చూపి నిలువు ముంచేస్తున్నారు.. అమాయక ప్రజలే టార్గెట్..!

హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘నకిలీ బంగారం’ చర్చే నడుస్తోంది. ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలను ఆసరాగా చేసుకుని, అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు కేటుగాళ్లు సరికొత్త పంథా ఎంచుకున్నారు. తక్కువ ధరకే వస్తాయని ఆశపడి నకిలీ బంగారు బిస్కెట్లను కొని జనం నిలువునా మునిగిపోతున్నారు.

వడ్డీ ఆశ చూపి నిలువు దోపిడీ..!

గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేద ప్రజలే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయి. “అత్యవసర పరిస్థితిలో ఉన్నాం.. మా దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి..

వీటిని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వండి.. వడ్డీ కూడా కలిపి ఇస్తాం” అంటూ నమ్మబలికి కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు.

తీరా తీరికగా చూసుకుంటే అవి గిల్టు నగలు లేదా నాణ్యత లేని నకిలీ ముక్కలని తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

జువెలరీ వ్యాపారులు, ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల హస్తం?

ఈ దందా వెనుక కొందరు స్థానిక జువెలరీ షాపుల యజమానుల పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నకిలీ బిస్కెట్లను అసలైనవిగా ధృవీకరించడంలో వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

కొందరు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ ముఠాతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వీరి సహకారంతోనే ఈ అక్రమ చలామణి యధేచ్ఛగా సాగుతోందని సమాచారం.

అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి..?

అసలు ఇంత పెద్ద మొత్తంలో నకిలీ బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో ఇంకా స్పష్టత రాలేదు.

ఇప్పటికీ నియోజకవర్గంలోని పలు జువెలరీ షాపుల్లో, మరికొందరు వ్యక్తుల దగ్గర భారీగా ఈ నకిలీ నిల్వలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారుల మౌనం.. పెచ్చరిల్లుతున్న అక్రమాలు

ఇంత బహిరంగంగా మోసాలు జరుగుతున్నా, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సదరు జువెలరీ షాపులపై తనిఖీలు నిర్వహించడంలో కానీ, చలామణి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కానీ యంత్రాంగం విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button