మందు బాబులకు అడ్డాగా గాంధీ పార్క్
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడిన హుజూర్ నగర్ లోని గాంధీ పార్క్ నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్థానికులు, వృద్ధులు, పిల్లలు సేదతీరాల్సిన చోట... మందు బాబులు తిష్టవేసి పార్కును మందుకుప్పగా మార్చేస్తున్నారు. పార్క్ లో అడుగుపెడితే పచ్చని గడ్డికి బదులు పగిలిన మద్యం సీసాలు, సిగరెట్ ముక్కలు, గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంతో స్థానికుల ఆగ్రహం..?
ఆరోగ్యం కోసం పార్కుకు వస్తే, అనారోగ్యాల పాలవుతున్నా జనం..!
మందు భూతాన్ని తరిమికొట్టేది ఎన్నడు..?
ఒకప్పుడు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడిన హుజూర్ నగర్ లోని గాంధీ పార్క్ నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
స్థానికులు, వృద్ధులు, పిల్లలు సేదతీరాల్సిన చోట… మందు బాబులు తిష్టవేసి పార్కును మందుకుప్పగా మార్చేస్తున్నారు.
పార్క్ లో అడుగుపెడితే పచ్చని గడ్డికి బదులు పగిలిన మద్యం సీసాలు, సిగరెట్ ముక్కలు, గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి.
ఆరోగ్యానికి, ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండాల్సిన పార్కును మందుబాబులు తమ సొంత బార్గా మార్చుకున్నారు.
పట్టపగలే విచ్చలవిడిగా సాగుతున్న ఈ అసాంఘిక పనుల వల్ల సామాన్య ప్రజలు పార్కులోకి అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
నిద్రపోతున్న అధికారులు – ఆవేదనలో స్థానికులు..!
ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కానీ, స్థానిక పోలీసులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు.
పార్కులో సెక్యూరిటీ లేకపోవడం, లైటింగ్ సరిగ్గా లేకపోవడం మందుబాబులకు వరంగా మారింది.
వ్యాయామం కోసం వచ్చే వాకింగ్ ప్రియులు, ఆడుకోవడానికి వచ్చే పిల్లలు ఈ గలీజు వాతావరణం చూసి వెనుదిరుగుతున్నారు.
ఆరోగ్యం కోసం పార్కుకు వస్తే..
మేము ఆరోగ్యం కోసం పార్కుకు వస్తే, ఇక్కడి కాలుష్యం, ఈ అసభ్యకర వాతావరణం చూసి అనారోగ్యం పాలయ్యేలా ఉన్నాం అని స్థానిక ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ పార్కును ఆక్రమించుకున్న ఈ ‘మందు’ భూతాన్ని తరిమికొట్టి, పార్కును మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హుజూర్ నగర్ పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందించి తక్షణమే గస్తీ ఏర్పాటు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



