మైత్రివనం – నీలగిరి బ్లాక్ భవనంలో అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న విద్యార్ధులు
ప్రాణాలు రక్షించుకునేందుకు బాల్కనీ నుండి కింది అంతస్తులకు దిగిన విద్యార్థులు పైన చిక్కుకున్న మరికొంత మంది విద్యార్థులను బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.

హైదరాబాద్ లోని మైత్రివనం – నీలగిరి బ్లాక్ భవనంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ మొత్తం పొగ వ్యాపించడంతో ఆందోళనతో విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీసారు.
నాలుగవ అంతస్తులో ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న విద్యార్ధులు ప్రాణాలు రక్షించుకునేందుకు బాల్కనీ నుండి కింది అంతస్తులకు దిగిన విద్యార్థులు పైన చిక్కుకున్న మరికొంత మంది విద్యార్థులను బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.
అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది తెలియాల్సి ఉంది.



