సైఫాబాద్ విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ ను రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
సంగీన ఫణిరాజ్ అనే ఉద్యోగి ఫిర్యాదు దారుడికి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ, రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ద్వారా రూ. 70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు

హైదరాబాద్ : సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ (జనరల్)గా పని చేస్తున్న సంగీన ఫణిరాజ్ అనే ఉద్యోగి ఫిర్యాదు దారుడికి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ, రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ద్వారా రూ. 70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని కోరారు.
వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ @TelanganaACB, వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.



