తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ లో జమ్మూ కాశ్మీర్
67 సంవత్సరాల తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ చేరింది. జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్లు సునీల్ కుమార్, అవుకిబ్ నబీలు బెంగాల్‌ను 99 పరుగులకు పరిమితం చేయగా, వంశజ్ శర్మ, అబ్దుల్ సమద్ కీలకమైన భాగస్వామ్యంతో అజేయంగా నిలిచారు.

బెంగాల్‌ను ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ కాశ్మీర్ జట్టు అర్హత సాధించింది. ఫైనల్ లో కర్ణాటకతో తలపడనుంది.
కల్యాణిలో బెంగాల్‌పై ఆరు వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ 126 పరుగులను ఛేదించింది,
67 సంవత్సరాల తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్ చేరింది. జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్లు సునీల్ కుమార్, అవుకిబ్ నబీలు బెంగాల్‌ను 99 పరుగులకు పరిమితం చేయగా, వంశజ్ శర్మ, అబ్దుల్ సమద్ కీలకమైన భాగస్వామ్యంతో అజేయంగా నిలిచారు.
సౌకర్యాల విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, బిషన్ సింగ్ బేడి వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో క్వార్టర్స్‌లో ఢిల్లీని ఓడించి సెమీస్ చేరారు. సెమీస్ లో బెంగాల్ ను ఓడించి ఫైనల్ కు చేరారు.
ఫైనల్ ఫిబ్రవరి 24-28 తేదీల్లో హుబ్బళ్లిలో ఎనిమిది సార్లు ఛాంపియన్స్ కర్ణాటకను ఎదుర్కొంటారు.