పొరపాటున చేయి తగిలిందా…ఖతమే..?
మృత్యుపాశంలా 11 కేవీ ట్రాన్స్ఫార్మర్..నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రధాన కూడలిలో, ఎటువంటి రక్షణ వలయం (ఫెన్సింగ్) లేకుండానే ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. చేతికి అందేంత చెంతనే మృత్యువు.. ఈ ట్రాన్స్ఫార్మర్ రహదారికి ఆనుకుని ఉండటమే కాకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా భూమికి తక్కువ ఎత్తులో ఉంది.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం
గరిడేపల్లి, ఫిబ్రవరి 5 (నిజం చెపుతాం)
మండల కేంద్రంలోని కల్మలచెరువు రోడ్డు చౌరస్తాలో ఉన్న 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది.
నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రధాన కూడలిలో, ఎటువంటి రక్షణ వలయం (ఫెన్సింగ్) లేకుండానే ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా దర్శనమిస్తోంది.
చేతికి అందేంత చెంతనే మృత్యువు.. ఈ ట్రాన్స్ఫార్మర్ రహదారికి ఆనుకుని ఉండటమే కాకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా భూమికి తక్కువ ఎత్తులో ఉంది.
పొరపాటున చేయి తగిలిందా…ఖతమే..?
దారి వెంట వెళ్లే ప్రయాణికులు పొరపాటున చేయి తగిలినా లేదా ఆదమరిచి అటువైపు వెళ్లినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. పాదచారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అధికారులు, నాయకుల ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వైఖరి ఇంతటి ప్రమాదకర పరిస్థితి కనిపిస్తున్నా.. స్థానిక లైన్మెన్ గానీ, ఏఈ గానీ కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
“ప్రమాదం జరిగిన తర్వాత వస్తారా? ప్రాణాలు పోయే వరకు ఎదురుచూస్తారా?” అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని రాజకీయ నాయకులు సైతం ఈ సమస్యపై మౌనం వహించడం పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి..
ప్రయాణికుల డిమాండ్: తక్షణమే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ బలమైన రక్షణ వలయాన్ని (ఫెన్సింగ్) ఏర్పాటు చేయాలి. ప్రమాద హెచ్చరిక బోర్డులను అమర్చాలి.
అధికారులు స్పందించాలి…
అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రమాదం జరగక ముందే విద్యుత్ శాఖ అధికారులు మేల్కొని రక్షణ చర్యలు చేపట్టాలని గరిడేపల్లి మండల ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.



