108 లో సదుపాయాలు లేక నిండు ప్రాణం బలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామానికి చెందిన నల్లం మధునమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో అస్తవ్యస్త గురికావడంతో బంధువులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వచ్చిన 108 వాహనం, మధునమ్మ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న క్రమంలో, వాహనంలో ఆక్సిజన్ సదుపాయం ఉండకపోవడం, బంధువులు ఆక్సిజన్ సిలిండర్ తీసుకు వచ్చినప్పటికీ అమర్చుటకు సిద్ధమైనప్పటికీ, 108 వాహనంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో, అత్యవసర సమయంలో మల్లమ్మకు ఆక్సిజన్ అందకపోవడం అదే 108 వాహనంలో, సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చే క్రమంలో మధునమ్మ మృతి చెందడం జరిగింది. తిరిగి మధునమ్మ మృతి దేహానికి తీసుకు వెళ్ళుటకు అంబులెన్స్ లేకపోవడంతో పేద కుటుంబమైన మధునమ్మ బంధువులు, ప్రైవేట్ ఆటో వాహనంలో మృతురాలికి ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది.

సదుపాయం లేని 108 వాహనాలు పెట్టి ఎన్ని ప్రాణాలు తీస్తారు.
108 అధికారుల,సిబ్బంది పై చర్యలు తీసుకోరా.
జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి.
మహాదేవపూర్, భూపాలపల్లి: జనవరి 4( నిజం న్యూస్)
అత్యవసర సేవల కొరకు 108 వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది, కానీ ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన, వాహనాలు ఆక్సిజన్ లాంటి ప్రధాన సౌకర్యం, విద్యుత్ సదుపాయం లేకపోవడం, నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం అత్యవసర సేవలకు అందించే వాహనాల పై నిఘా లేకపోవడం, సమయానికి అందుబాటులోకి రాకపోవడం ఎంతో నమ్మకం తో ఉన్న పేద ప్రజలకు, 108 వాహనాలు ప్రాణాలు పోస్తాయి అనుకుంటున్న క్రమంలో పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు, తాజాగా ఆక్సిజన్ విద్యుత్ సదుపాయం లేక, మహిళ మృతి చెందడమే ఓ సాక్ష్యం.
సదుపాయం లేక నిండు ప్రాణం బలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామానికి చెందిన నల్లం మధునమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో అస్తవ్యస్త గురికావడంతో బంధువులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వచ్చిన 108 వాహనం, మధునమ్మ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న క్రమంలో, వాహనంలో ఆక్సిజన్ సదుపాయం ఉండకపోవడం, బంధువులు ఆక్సిజన్ సిలిండర్ తీసుకు వచ్చినప్పటికీ అమర్చుటకు సిద్ధమైనప్పటికీ, 108 వాహనంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో, అత్యవసర సమయంలో మల్లమ్మకు ఆక్సిజన్ అందకపోవడం అదే 108 వాహనంలో, సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చే క్రమంలో మధునమ్మ మృతి చెందడం జరిగింది. తిరిగి మధునమ్మ మృతి దేహానికి తీసుకు వెళ్ళుటకు అంబులెన్స్ లేకపోవడంతో పేద కుటుంబమైన మధునమ్మ బంధువులు, ప్రైవేట్ ఆటో వాహనంలో మృతురాలికి ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది.
సదుపాయం లేని 108 వాహనాలు పెట్టి ఎన్ని ప్రాణాలు తీస్తారు.
జిల్లాలో 108 వాహనాల సిబ్బంది అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి కావడం, ప్రత్యేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని, మహాదేవపూర్ పలివెల మండలాల్లో కొత్తేమీ కాదు, గత సంవత్సరం అక్టోబర్ నెలలో, పలిమెల మండలంలోని ఓ గ్రామంలో, ఉదయం నుండి సాయంత్రం వరకు, ఫిదా యువకుడు అనారోగ్యానికి గురై, వేచి చూస్తున్నప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలకు, వాహనం రావడం చికిత్స కొరకు తీసుకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యమంలోని మృతి చెందిన సంఘటన మరువక ముందే, మండలంలోని కుదురుపల్లి గ్రామంలోని పేద మహిళ 108 వాహనంలో సదుపాయం లేకపోవడం తో మృతి చెందడం జరిగిన సంఘటన చూస్తే, 108 వాహనాలు ప్రజల ప్రాణాల రక్షణ కొరకు కాదు, చివరి శ్వాస కు చేరి వరకు వచ్చి, సదుపాయం లేదని చెప్పి, వాహనంలో తీసుకు వెళుతూ పేద రోగులకు పరలోకానికి పంపే ప్రణాళిక చేసుకున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.
జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి.
108 వాహనాల సిబ్బంది మరియు అధికారుల నిర్లక్ష్యాలకు, నిండు పేద ప్రాణాలు బలి అవుతున్న క్రమంలో, సిబ్బందిపై లేదా అధికారులపై నేటికీ చర్యలు తీసుకోకపోవడం తో 108 వాహనాల్లో సదుపాయాలకు అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలకు బలి కొంటు నే ఉంది, అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ నేటికీ అధికారులు, చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో అధికారుల నిర్లక్ష్యాలకు మరిన్ని ప్రాణాలు బలి తీసుకుంటారు అని అంటూ ఆగ్రహిస్తున్నారు, 108 వాహనాలకు సంబంధించిన అధికారులు మరియు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, 108 వాహనాలకు సంబంధించి, ఆక్సిజన్ విద్యుత్ తో పాటు అదనంగా 108 వాహనాలు మండల సామాజిక కేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.