రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

కరీంనగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చొప్పదండి మండల పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న పైడి సతీష్ (గతంలో గంగాధర మండల ఏఈ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

నిజం న్యూస్ | 09-07-2026

కరీంనగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చొప్పదండి మండల పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న పైడి సతీష్ (గతంలో గంగాధర మండల ఏఈ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

 

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఫిర్యాదుదారు చేపట్టిన సీసీ రోడ్డు పనులకు సంబంధించిన కొలతలను ఎం-బుక్‌లో నమోదు చేసి, వాటిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు పంపేందుకు ప్రతిఫలంగా రూ.10 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా, కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం సుమారు 5:05 గంటలకు వలపన్ని పట్టుకున్నారు.

 

లంచంగా తీసుకున్న రూ.10 వేల నగదును అధికారులు నిందితుడి టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం సీటు కింద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది.

 

నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.

 

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

 

– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button