మా సరస్వతి తల్లి కి మేము ఉన్నాము.
మా బడి శిథిలావస్థకు చెర కూడదు, పునర్ వైభవం రావాలి.

మా సరస్వతి తల్లి కి మేము ఉన్నాము.
మా బడి శిథిలావస్థకు చెర కూడదు, పునర్ వైభవం రావాలి.
ప్రభుత్వ బడి ఇది మా బడి, దీనికి కార్పొరేట్ గా మారుస్తాం.
ఈ సరస్వతి తల్లి ఆశీర్వాదంతోనే మేము ఉన్నత శిఖరాల్లో ఉన్నాం.
విద్యాశాఖ పట్టించుకోకుంటే మేము లేమా, మా బడి మాకు ముద్దు.
ఐదు సంవత్సరాలుగా మూతపడ్డ పాఠశాలకు పూర్వ విద్యార్థులతో కళ వైపు.
పాఠశాల పై పూర్వ విద్యార్థుల ప్రేమ హృదయాలను కుదిపేస్తుంది.
హైదరాబాద్,అలీబాబా న్యూస్:
ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసంచి ఉన్నత శిఖరాలకు ఎదగడం, ఆనంద జీవితాన్ని గడపడం, ప్రైమరీ పాఠశాల పునాది విద్య తూ ప్రారంభమైన జీవితం, చివరికి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల తాము డిగ్రీ బీటెక్ మరో ఇతర ఉన్నత విద్యను అభ్యాసించామని డిగ్రీ స్థాయి విశ్వవిద్యాలయాల పేర్లు మాత్రం నేడు గుర్తుంటాయి, కానీ అక్షర అభ్యాసం చేయించిన ఆ సరస్వతి తల్లి ఆశీర్వాదం అందించిన ఆ ప్రభుత్వ పాఠశాల మాత్రం అందరికీ గుర్తుండదు, గ్రామీణ ప్రాంతం నుండి ప్రారంభమైన జీవితం, పట్టణం వరకు చేరి తిరిగి అక్కడి నుండి విదేశాలకు ప్రయాణిస్తుంది. కానీ అక్షరాభ్యాసంతో సరస్వతి తల్లి ఆ విద్యార్థి గుండెల్లో అక్షర బీజాన్ని, వేసిన ఆ పాఠశాల మాత్రం తమ విద్యార్థు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశించుతుందే తప్ప, కనీసం డంకుచున్నానికి కూడా ఆశపడదు” ఇలాంటి అనేక ఉదాహరణలు, నేడు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరి, కొన్ని పాఠశాలలు ప్రభుత్వానిధులతో, వాటి రూపు రేఖలు మార్చడం కూడా జరుగుతుంది కానీ, ఆ విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని అందించిన ఆ సరస్వతి తల్లి, శిథిలావస్థకు చేరి, ఆ తల్లి ఓడిలో విద్యార్థులు కరువైన ఉన్నవేళ ఆ పూర్వ విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు, ఇది మా బడి నా సరస్వతీ తల్లికి మేము అండగా ఉన్నాము, తిరిగి తల్లి ఓడిలో అక్షరాభ్యాసంతో విద్యను ప్రారంభించుటకు మా పాఠశాల పూర్తిస్థాయి మరమ్మత్తులు చేస్తామని, పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలతో అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యా అధికారులతో, చర్చించి విరాళాలు అందించిన కార్యక్రమం ప్రారంభించడం, ఆ పూర్వ విద్యార్థుల గొప్ప నిర్ణయాన్ని ఆ గ్రామస్తులే కాదు యావత్ జిల్లా మరియు రాష్ట్ర ప్రజలు గర్వించేలా చేశారు ఆ విద్యార్థులు.
మా బడి శిథిలావస్థకు చెర కూడదు, పునర్ వైభవం రావాలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలం
వెల్మలపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల సుమారు గత ఐదు నుండి ఆరు సంవత్సరాల విద్యార్థులు లేరని అధికారులు పాఠశాలను మూసివేయడం జరిగింది. సుమారు 40 మంది విద్యార్థులు, వెల్మలపల్లి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిచెర్ల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలకు వెళ్లడం జరుగుతుంది. అలాగే మరికొందరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల స్థానికంగా లేకపోవడంతో, ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల వైపు, రప్పించవలసిన విద్యాశాఖ వెలుమలపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల నిర్వహణలో అలసత్యం వహించారని స్పష్టంగా కనబడుతుంది. విద్యాశాఖ నిర్లక్ష్యం పాఠశాల మూతపడడంతో. వెలుమలపల్లి లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల శిథిల అవస్థకు చేరింది. సంవత్సరాలు గడుస్తున్న విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో. స్థానిక గ్రామస్తులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించి తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలకు తరలిస్తున్నారు. కానీ ఈ వ్యవహారం ఇంతటితో సమాప్తం కాలేదు, వెలుమలపల్లి లోని ప్రైమరీ పాఠశాల ఆ సరస్వతి తల్లి ఆశీర్వాదం పొందిన పూర్వ విద్యార్థులు, తమ పాఠశాల శిథిల అవస్థకు చేరి మూతపడి ఉన్న విషయం జీర్ణించుకోలేకపోయారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వెలిశాలపల్లి పూర్వ విద్యార్థులు, తమ పాఠశాలకు పునర్ వైభవం వచ్చేలా చేస్తామని సంకల్పంతో ముందుకు వచ్చారు ఆ పూర్వ విద్యార్థులు చల్ల ప్రవీణ్, బూడిద సతీష్, రాగం అనిల్ ,అంగజాల సంజీవులు, కందుల సాయి.
ప్రభుత్వ బడి ఇది మా బడి, దీనికి కార్పొరేట్ గా మారుస్తాం.
ఇది ప్రభుత్వ పాఠశాల దీనికి ప్రభుత్వమే రక్షించాలి అనుకునే సమాజంలో, పాఠశాల అంటే అది సరస్వతి తల్లి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, అనేక కాలంగా అమలులోకి వచ్చి, ఫిదా మధ్యతరగతి కనిక అనే భేదం లేకుండా, విద్యను అందించే ఒక సరస్వతి మందిరం లాంటిది ప్రభుత్వ పాఠశాల. అలాంటి వాటిలోనే ఒకటి గా ఉన్న వెలుమలపల్లి ప్రైమరీ పాఠశాల కూడా. ఆ పాఠశాల సుమారు 6 సంవత్సరాలుగా, విద్యార్థులకు విద్యతో దూరమై, మూగబోయిన ఆ సరస్వతి తల్లి చివరికి శిథిల అవస్థలు, “రండి నా బిడ్డల్లారా” నేను మీ సరస్వతి తల్లి నా బడిలో మీకు అక్షరాలు నేర్పిస్తారు” అంటూ ఆ శిథిల అవస్థలో కూడా, విద్యార్థుల కొరకు ఎదురుచూస్తున్న ఆ వెలుమల పల్లి ప్రైమరీ పాఠశాలకు, తల్లి వేము తిరిగి మళ్లీ నీ దగ్గరికి వస్తున్నాం, నీ పూర్వ విద్యార్థులం నీ వోడిలో తిరిగి విద్యార్థులకు అందిస్తాం, అంటూ ఆ పూర్వ విద్యార్థులు, అందరూ ఏకమై గ్రామ పెద్దలు స్థానిక విద్య అధికారుల సహాయంతో, పూర్తిస్థాయి పాఠశాల మరమ్మతుకు, నిధులు కూడగట్టుకొని, పూర్వ విద్యార్థుల సమక్షంలో, కార్పొరేట్ స్థాయి మరమ్మతు పనులను ప్రారంభించుటకు సామాగ్రిని సైతం కొనుగోలు చేయడం జరిగింది. రేపు మాకు పనులు ప్రారంభించి తిరిగి పాఠశాలలో విద్యార్థుల కొరకు ఇప్పటికి సుమారు 60 మంది విద్యార్థులకు ఆ పూర్వ విద్యార్థులు, ప్రైమరీ విద్య కొరకు పేర్లను నమోదు కూడా చేశారు. చివరికి ఆరు సంవత్సరాల పాటు, తమ ఊరిలో బడి లేకపోవడం విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురై, పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు మూడు కిలోమీటర్ల కాలినడకతో తాడిచెర్ల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడం, ఎక్కువమంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న క్రమంలో ఈ విద్యా సంవత్సరం నుండి, వెలిమెల పల్లిలో ప్రైమరీ పాఠశాల తిరిగి ప్రారంభమై పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశకు అడుగులు వేస్తుంది.
విద్యాశాఖ పట్టించుకోకుంటే మేము లేమా, మా బడి మాకు ముద్దు.
ఐదు సంవత్సరాలుగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పై విద్యాశాఖ పట్టించుకోకపోవడం, ఏళ్ల తరబడి కొనసాగిన ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఒకేసారి మూతపడడం. గత ఆరు సంవత్సరాలుగా గ్రామానికి సంబంధించిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న విద్యాశాఖ పట్టించుకోకపోవడం జరిగిందని విలువలపల్లి పాఠశాల ప్రస్తుత పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కానీ విద్య అనేది ఒక గొప్ప వరం, పాఠశాలలో ఒక్క సంవత్సరమైనా కూడా విద్య అభ్యసించిన ఆ విద్యార్థులకు, తాము సరస్వతి తల్లి ఒడిలో, అక్షర అభ్యాసాన్ని నేర్చుకున్నాము, ఈరోజు ఉన్న ఉన్నత శిఖరాలకు కారణం ఆ పాఠశాల అని భావన కలిగించే ఒకే సంకల్పం విద్య, విద్యాశాఖ ప్రభుత్వం వదిలేస్తే ఏమి, ఓ సరస్వతి తల్లి నీకు మేము అండగా ఉన్నాం అంటూ పూర్వ విద్యార్థులు, పాఠశాల మరమ్మత్తు, విద్యార్థుల ఎంపిక, చేసి తిరిగి పాఠశాలలో విద్యలు కొనసాగించుటకు చేస్తున్న ఆ పూర్వ విద్యార్థుల దృఢమైన సంకల్పం, విద్యపై వారికి ఉన్న ప్రేమ, పాఠశాల ఒక సరస్వతి నిలయమని భావించిన ఆ విద్యార్థుల నమ్మకం, తమలాగే తమ గ్రామ విద్యార్థులు ఎదగాలని సంకల్పంతో ముందుకు వచ్చి పాఠశాల పునర్ వైభవం కొరకు ప్రారంభించిన ప్రయత్నాన్ని, వెలిమెలపల్లి గ్రామస్తులే కాకుండా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలు హర్షించి శభాష్ అని మెచ్చుకునేలా చేస్తున్నారు ఆ పూర్వ విద్యార్థులు.



