ప్రజల ప్రాణాలతో చెలగాటం

హైదరాబాద్ చుట్టుపక్కల గల ఫార్మా కంపెనీల నుండి రాత్రి సమయంలో వచ్చిన 30కి పైగా లారీలు ఇక్కడ నిలిచి ఉన్నాయి. ఈ లారీలు మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ కు వెళ్లాల్సి ఉండగా అకస్మాత్తుగా అనుమతి లేదంటూ పరిశ్రమ యాజమాన్యం అడ్డుకున్నారు.

*సిమెంట్ పరిశ్రమలో భారీగా నిషేధిత రసాయనాల వినియోగం*

 

*రెండు రోజులుగా పరిశ్రమలోకి అనుమతించకపోవడంతో పెద్ద ఎత్తున నిలిచిన ప్రాణాంతక రసాయన వాహనాలు*

 

మేళ్లచెరువు లో వ్యర్థ రసాయన లారీల కలకలం

 

*ప్రజలు కంటపడకుండా కంపచెట్ల వెనుక దాచిపెట్టిన మైహోమ్ సిమెంట్స్ యాజమాన్యం..?*

మేళ్లచెరువు జూన్ 18 నిజం చెపుతాం:

* సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని వేపలమాదారం రోడ్డులో ప్రాణాంతక రసాయన వాహనాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా పదుల సంఖ్యలో వ్యర్ధ రసాయన వాహనాలు రహస్యంగా దాచి పెట్టడం పట్ల పలు ఆరోపణ వినిపిస్తున్నాయి.

ఈ వ్యర్థ రసాయన వాహనాల నుండి వెలువడే గాడమైన వాసనతో ఊపిరాడక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మేళ్లచెరువు సర్వేనెంబర్ 874లో గల ప్రభుత్వ భూమిలో గత మూడు రోజులుగా ప్రాణాంతక వ్యర్ధ రసాయనాల లారీలు దాచిపెట్టడంతో ప్రజల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హైదరాబాద్ చుట్టుపక్కల గల ఫార్మా కంపెనీల నుండి రాత్రి సమయంలో వచ్చిన 30కి పైగా లారీలు ఇక్కడ నిలిచి ఉన్నాయి. ఈ లారీలు మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ కు వెళ్లాల్సి ఉండగా అకస్మాత్తుగా అనుమతి లేదంటూ పరిశ్రమ యాజమాన్యం అడ్డుకున్నారు.

* ఈ వాహనాల నుండి ఘాడమైన వాసన రావడంతో ఈ వాహనాలను మైహోమ్ సిమెంట్ పరిశ్రమ వద్ద నుండి వేపల మాదారం దారిలో గల ప్రభుత్వ భూమిలో దాచి పెట్టారు. ఈ వాహనాలు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం వలన రసాయనాలు వాతావరణంలో, భూమిలో కలిసి ఇక్కడ పశువులకు ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు దిగుమతి కోసం రాగా ఆ పరిశ్రమ యాజమాన్యం వారు ఈ లారీలను ఇక్కడ దాచి పెట్టారని వాహన డ్రైవర్లు చెబుతున్నారు. పరిశ్రమలో పెద్ద సార్లు వచ్చారని అందుకే ఈ వాహనాలు ఇక్కడ ఉంచారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. ఈ లారీల వద్ద వెలువడే గాడమైన వాసనకు తట్టుకోలేక లారీ డ్రైవర్లు సైతం ఈ లారీలకు చాలా దూరంలో మాఖం వెయ్యడం కొసమెరుపు.

 

*ఏమిటి ఈ ప్రాణాంతక వ్యర్ధ రసాయనాలు..?*

 

ముడి సున్నపురాయిని అధిక ఉష్ణోగ్రత వద్ద బొగ్గుతో మండిస్తే సిమెంటుతయారీకి కావాల్సిన పదార్ధంగా తయారవుతుంది. బొగ్గు ధర ఎక్కువగా ఉండడం. వ్యర్ధ రసాయనాలు తక్కువ ధరకు దొరకడం వల్ల సిమెంటు యాజమాన్యాలు ప్రజా ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా రసాయన వ్యర్ధాలను పరిమితికి మించి వినియోగిస్తున్నారు. బొగ్గుకు సర్ఫోరిక్ యాసిడ్ను కలిపినట్లయితే ఎక్కువసేపు మండడంతో పాటు అధిక ఉష్ణోగ్రత వెలబడుతుంది. దీని నుంచి వెలువడిన హానికర రసాయన పదార్థాలను పట్టించుకోకుండా ఖర్చు తగ్గించుకోవడమే ధ్యేయంగా సదరు ఫ్యాక్టరీలు కొన్ని ఏండ్లుగా వ్యర్థ రసాయనాలు వినియోగిస్తున్నారు.దీనివల్ల జీవులను అనేక రోగాలుగా వచ్చే ప్రమాదంముంది. అంతేకాక ఇది భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. సల్పోరిక్ ఆమ్లం ఎక్కువసేపు మండటం వల్ల గాలిలో కార్బన్డయాక్సైడ్ శాతం పెరిగి అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతాయి. ఇప్పటికే మేళ్లచెరువు ఉమ్మడి మండలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు గా నమోదవుతున్నాయి.

 

*పరిమితికి మించి రసాయనాల వినియోగం*

 

బొగ్గును, క్లింకర్ ను మండించేందుకు ఈ వ్యర్ధ రసాయనాలను పరిమితి మించి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు స్థానికులు నుండి వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల గల ఫార్మా కంపెనీలు ఈ సిమెంట్ పరిశ్రమలకు ఎదురు డబ్బులు ఇచ్చి ఈ వ్యర్థాలను దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఉచితంగా వస్తుండడంతో రోజుకి రెండు లారీలు మాత్రమే వినియోగించాల్సిన చోట ఏకంగా రోజుకి 15 నుండి 20 లారీల వ్యర్థ రసాయనాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రెండు రోజులు పరిశ్రమలోకి ఈ లారీలను అనుమతించకపోవడంతో ఇక్కడ 30కి పైగా వాహనాలు నిలిచిపోవడంతో ఈ రసాయన వినియోగం పరిమితికి మించి జరుగుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది. మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ఆడిట్ బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సమయంలో ఈ వ్యర్థ రసాయన వాహనాలను లోపలికి అనుమతించడం లేదంటే నే అర్థమవుతుంది ఈ వ్యర్థ రసాయనాల వాడకం ఎంత ప్రమాదము…! నిషేధమే..!

అధిక మొత్తంలో ఈ రసాయనాలను వినియోగించి సిమెంట్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న ఆరోపణ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పర్యావరణ శాఖ అధికారులు స్పందించి పరిమితికి మించి నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యర్థ రసాయనాలను వినియోగిస్తున్న సిమెంట్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button