లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు
ఫిర్యాదుదారుడి నుండి రూ. 13,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. రమేష్ (48), ఫిర్యాదుదారుడి నుండి రూ. 13,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
తనతో పాటు అదే సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ తరపున కూడా ఈ మొత్తాన్ని వసూలు చేసిన రమేష్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన పెన్షన్ బెనిఫిట్ ఫైల్‌ను ఇప్పటికే ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపినందుకు ప్రతిఫలంగా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను తదుపరి చర్యల కోసం పంపేందుకు (అధికారిక మేలు చేసేందుకు) గాను ఈ లంచాన్ని అక్రమ ప్రయోజనం కింద లంచాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని అధికారులు తెలుపుతున్నారు.



