ఖానాపూర్‌ మున్సిపల్ పీఠంపై నజర్.. ఎన్నికల ప్రక్రియలో లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు

ఈ నెల 4వ తేదీ శనివారం నాడు జరగనున్న ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎన్నికైన కౌన్సిలర్లకు రాజకీయ పార్టీల వారీగా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, వారందరికీ తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు.

​- పారదర్శకంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి

– ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

​ఖానాపూర్, ఏప్రిల్ 01 (నిర్మల్ జిల్లా ప్రతినిధి నిజం చెపుతాం):

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ శనివారం నాడు జరగనున్న ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా ఎన్నికైన కౌన్సిలర్లకు రాజకీయ పార్టీల వారీగా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, వారందరికీ తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు.

మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ సహకారంతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button