కొండగట్టు ఆలయంలో కూలిన పందిరి…15 మంది భక్తులకు తీవ్ర గాయాలు..వారిలో ఇద్దరు
కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా వేసిన పందిరి కూలి పలువురు భక్తులు గాయపడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

కొండగట్టు ఆలయంలో ప్రమాదం..
కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా వేసిన పందిరి కూలి పలువురు భక్తులు గాయపడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
కేశఖండనం వద్ద చలువ పందిరి వద్ద ఏర్పాటు చేసిన పందిరి పనులు నాసిరకంగా ఉండటంతో అవి కూలినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
భక్తులపై పడటంతో 15 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
నాసిరక పనులను చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.