వరుస సెలవుల ప్రభావం- యాదాద్రిలో భక్తుల వెల్లువ… 3 గంటల పాటు క్యూలో భక్తులు

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది వరుస సెలవులు ఉండటంతో స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.

యాదగిరిగుట్ట, మార్చి 21(నిజంచెపుతాం) యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది వరుస సెలవులు ఉండటంతో స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.

 

సర్వదర్శనానికి వచ్చిన భక్తులు సుమారు 3 గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది.

ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది.ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో క్యూలైన్లు నిండిపోయాయి.

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి దర్శనాన్ని సాఫీగా నిర్వహిస్తున్నారు.

తాగునీరు, భద్రత, క్యూలైన్ నిర్వహణ వంటి సౌకర్యాలను కల్పిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button