హుజూర్ నగర్‌లో ప్రమాదకర ఫ్లెక్సీల తొలగింపు…నిజం న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు

బుధవారం ఉదయం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన చోదకుల దృష్టిని మళ్లించేలా, మలుపులను అడ్డుకునేలా ఉన్న భారీ ఫ్లెక్సీలను సిబ్బంది సహాయంతో తొలగించారు.

హుజూర్ నగర్‌లో ప్రమాదకర ఫ్లెక్సీల తొలగింపు.!

హుజూర్ నగర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన దారుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫ్లెక్సీల అంశంపై ‘నిజం న్యూస్’ కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు.

*”కనిపించని మలుపు పొంచి ఉన్న ప్రమాదం*” పేరుతో మంగళవారం నిజం లో వచ్చిన వార్తకు స్పందన రావడంతో మున్సిపల్ అధికార యంత్రాంగం మరియు పోలీస్ శాఖ తక్షణమే స్పందించాయి.

  • బుధవారం ఉదయం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన చోదకుల దృష్టిని మళ్లించేలా, మలుపులను అడ్డుకునేలా ఉన్న భారీ ఫ్లెక్సీలను సిబ్బంది సహాయంతో తొలగించారు.

అధికారుల సత్వర చర్యపై పట్టణ ప్రజలు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నాను.

వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న మున్సిపల్ మరియు పోలీస్ అధికారులకు వాహనదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button