ఈ లెక్క ప్రకారం ఎలా చూసినా టి20 వరల్డ్ కప్ ఇండియాదే..?
2011లో ధోనీ సేన ప్రపంచకప్ ముద్దాడిన అప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ లోనూ జరిగే అవకాశం ఉందని అభిమానులు లెక్కలు కడుతున్నారు

World Cup Sentiment:
క్రికెట్ లో సెంటిమెంట్ లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 2011 లాగానే 2026 కూడా ఉండే అవకాశం ఉందని అభిమానులు లెక్కలు కొడుతున్నారు. దీనికోసం 2011లో జరిగిన కొన్ని విషయాలను వారు ఉదాహరణగా చూపుతున్నారు.
2011లో ధోనీ సేన ప్రపంచకప్ ముద్దాడిన అప్పుడు జరిగిన సంఘటనలే ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ లోనూ జరిగే అవకాశం ఉందని అభిమానులు లెక్కలు కడుతున్నారు.
2026 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియానే గెలుస్తుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. 2011 మళ్ళీ రిపీట్ అవుతోందని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. .
భారత్, శ్రీలంకలే సంయుక్తంగా ఆతిథ్యం:
2011 వన్డే వరల్డ్ కప్‌కు భారత్ & శ్రీలంక లు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి.
టీ20 వరల్డ్ కప్‌కు కూడా ఈ రెండు దేశాలే ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల సెంటిమెంట్ మరింత బలంగా పెరిగింది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్: 2011లో భారత జట్టు లీగ్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో మాత్రమే ఓటమి పాలైంది. ఇప్పుడు కూడా టీమ్ ఇండియా సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిపోయింది. ఇది కూడా మనకు అనుకూలంగానే జరుగుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
అప్పుడు, ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనే దక్షిణాఫ్రికా అవుట్:
2011 క్వార్టర్ ఫైనల్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ కు చేరింది అలాగే ఇప్పుడు కూడా సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి దక్షిణాఫ్రికా నిష్క్రమించింది. అప్పుడు ఇప్పుడు ఇలాగే జరిగింది కనుక కచ్చితంగా ఈ వరల్డ్ కప్ మనకే వస్తుంది అని అనుకుంటున్నారు.
2011 లో భారత్ విజేతగా… 2016లో కూడా…
2011లో భారత్ ఫైనల్‌లో గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది.
2026లో కూడా అదే సెంటిమెంట్ కొనసాగి భారత్ మళ్ళీ కప్పు గెలుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
ఏది ఏమైనా సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి భారత్ కు మూడో టీ20 ప్రపంచకప్ అందుతుందో లేదో.. చూడాలి మరి



