సెమీ ఫైనల్ మ్యాచ్ కు 7 కు సంబంధం ఏమైనా ఉందా..?

గురువారం వాంఖడే స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 7 అంకెకు చాలా బలమైన సంబంధం ఉన్నట్లుగా కనిపించింది. అది ఎలాగంటే
భారతదేశం 7 పరుగుల తేడాతో గెలిచింది
ఇంగ్లాండ్ కూడా 7 వికెట్లను కొల్పోయింది.
భారతదేశం 7 వికెట్లను కోల్పోయింది.
భారత్ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరర్ సామ్సన్ 7 సిక్సర్లు కొట్టాడు.
ఇంగ్లాండ్‌లో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరర్ బెథెల్ సాధించిన సెంచరీలో 7 సిక్సర్లున్నాయి.
సంజు T20I హాఫ్ సెంచరీ సంఖ్య .. 7
టీ20 టోర్నమెంట్‌లో భారతదేశం 7వ మ్యాచ్‌లను గెలిచింది
హ్యారీ బ్రూక్ చేసిన పరుగులు …7
E+N+G+L+A+N+D మొత్తం అక్షరాలను కలిపితే 7 వస్తుంది.
వాంఖడే స్టేడియంలో భారత్ 7వ ICC మ్యాచ్‌ను గెలిచింది.
ఇంగ్లాండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.



