T20 World Cup: సెమీస్ లో భారత్, పాక్ ల పోరు చూసే అవకాశం ఉందా..?

T20 World Cup: గ్రూప్ 2లో శుక్రవారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా నిలబడి ఉన్నాయి.

T20 World Cup:

సెమీఫైనల్ లో భారత్ పాక్ లు మరోసారి తలపడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఈ రెండు జట్లు మరో మారు తలపడాలంటే గ్రూపు 1 భారత్, ఆదివారం జరిగే పోరులో వెస్టిండీస్ పై గెలుపొందాలి.

అలాగే పాకిస్తాన్, శ్రీలంకపై 65 పరుగుల తేడాతో గెలుపొందగలగాలి.

ఇలా జరిగితే మరోకసారి దాయాదుల పోరును చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

గ్రూప్ 2లో శుక్రవారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా నిలబడి ఉన్నాయి.

గ్రూప్ 2లో ఇప్పటికే ఇంగ్లాండు ఆరు పాయింట్లతో సెమీస్కు చేరుకోగా న్యూజిలాండ్ మూడు పాయింట్లతో మెరుగైన రన్ రేట్(1.39) తో ఉంది.

పాకిస్తాను న్యూజిలాండ్ కంటే రన్ రేటు (-0.46) చాలా తక్కువగా ఉంది.

శ్రీలంకపై, పాకిస్తాను మెరుగైన రన్ రేట్ గెలిస్తేనే న్యూజిలాండ్ ను అధిగమించి  సెమీఫైనల్ లో చేరే అవకాశం ఉంది.

అలాగే గ్రూప్ వన్ లో దక్షిణాఫ్రికా దాదాపు సెమీస్కు చేరుకోగా వెస్టిండీస్ భారత్ లతో జరిగే మ్యాచ్లో గెలుపొందిన వారు సెమీస్కు చేరుకోవడానికి అవకాశం ఉంది.

భారత్ పాకిస్తాన్  సెమీస్ లో తలపడే అవకాశం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ క్రికెట్లో ఏదైనా సాధ్యమే కదా.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button