India vs Pakistan : పాక్ తో మ్యాచ్ కు అభిషేక్ శర్మ రెడీ
గత కొన్ని రోజులుగా అభిషేక్ శర్మ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కోట్లాది మంది అభిమానులకు, భారత జట్టుకు ఇది శుభ వార్తే

India vs Pakistan : టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
- గత కొన్ని రోజులుగా అభిషేక్ శర్మ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కోట్లాది మంది అభిమానులకు, భారత జట్టుకు ఇది శుభ వార్తే.
బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. అభిషేక్ శర్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని, ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారని తిలక్ వర్మ స్పష్టం చేశాడు.
అభిషేక్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యాడు…
తిలక్ వర్మ మాట్లాడుతూ.. “అభిషేక్ ఈరోజే డిశ్చార్జ్ అయ్యారు. మ్యాచ్‌కు ఇంకా ఒక రోజు సమయం ఉంది. రేపు ఆయన రికవరీని నిశితంగా పరిశీలిస్తాం. ఆయన శారీరక స్థితిని బట్టి నమీబియాతో మ్యాచ్‌లో ఆడించాలా వద్దా అనే తుది నిర్ణయం తీసుకుంటాం” అని వెల్లడించారు. మేనేజ్మెంట్ ఆయనపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలని అనుకోవడం లేదని తెలిపారు.
తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిక…
టీమిండియా ఆటగాళ్లంతా కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసంలో ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి వెళ్లారు. అక్కడ అభిషేక్ శర్మకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో మధ్యలోనే తిరిగి వచ్చేశారు. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
పాకిస్థాన్ పై అద్భుతమైన రికార్డు…

ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంది. ఇటువంటి సమయంలో అభిషేక్ ఆసుపత్రిలో చేరడం అభిమానులను కలవరపెట్టింది. పాకిస్థాన్‌పై అభిషేక్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ కు ముందుగా కోలుకోవడం శుభ వార్త.



