IND VS PAK: భారత్‌, పాక్‌ టీ20 మ్యాచ్ కు లైన్‌ క్లియర్

టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటిస్తూ వచ్చిన పాక్… వెనక్కి తగ్గింది. ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుంది.  చర్చల అనంతరం మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది.

IND VS PAK: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటిస్తూ వచ్చిన పాక్… వెనక్కి తగ్గింది. ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుంది.  చర్చల అనంతరం మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది.

మ్యాచ్‌ ఆడేందుకు పాక్ అంగీకారం…

భారత్‌తో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్‌.. లేటెస్ట్‌గా మనసు మార్చుకుంది. ఈ అంశంలో పాక్‌తో చర్చలు జరిపేందుకు ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజా లాహోర్‌ వెళ్లారు.

అక్కడ పీసీబీ, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సభ్యులతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే వెనక్కి తగ్గి మ్యాచ్‌ ఆడేందుకు పాక్ అంగీకరించింది. చర్చల్లో భాగంగా పీసీబీ పలు ప్రతిపాదనలు ఐసీసీ ముందు ఉంచింది.

భారత్‌- పాక్‌- బంగ్లాదేశ్‌ మధ్య త్రైపాక్షిక సిరీస్‌ నిర్వహించాలని కోరింది. అయితే ఐసీసీ తిరస్కరించింది. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌ను అభ్యర్థించింది. క్రికెట్‌ వ్యవస్థ ప్రయోజనం కోసం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగాలని అభిప్రాయపడింది.

మ్యాచ్ ఆడాలని ఆదేశాలు…

షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ ఆడాలని పీసీబీని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్‌, పాక్‌ మధ్య టీ20 మ్యాచ్ జరిగేందుకు లైన్‌ క్లియర్ అయ్యింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button