ఫిబ్రవరి 11న వేతనంతో కూడిన సెలవు మంజూరు

తెలంగాణ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 చట్ట ప్రకారము యజమానులు తప్పనిసరిగా మూసివేసి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకొబడతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష

దుకాణ,వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పని చేయుచున్న కార్మికులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

రామగుండం ఫిబ్రవరి 9, (నిజం న్యూస్)

ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి వాణిజ్య,దుకాణం, వ్యాపార సంస్థలలో పని చేసే కార్మికులకు, ప్రభుత్వ,ప్రైవేటు రంగాలలో పనిచేసే ఉద్యోగులు సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని,జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని దుకాణ, వాణిజ్యసంస్థల యజమానులకు, వ్యాపార సంస్థల యజమానులు ఫిబ్రవరి 11 బుధవారం రోజున మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమ దుకాణ,వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పని చేయుచున్న కార్మికులకు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా వేతనం తో కూడిన సెలవు మంజూరు చేయాలని అన్నారు.

ఫిబ్రవరి 11న, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ జరిగే సమయంలో షిఫ్ట్ లో ఉన్న ఉద్యోగులకు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సిబ్బందికి కూడా తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

తెలంగాణ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 చట్ట ప్రకారము యజమానులు తప్పనిసరిగా మూసివేసి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకొబడతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button