నివాసితుల‌కు దారి చూపిన హైడ్రా

ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు సంబంధిత అధికారుల‌తో హైడ్రా విచారించి.. ర‌హ‌దారిగా నిర్ధారించింది. ఎలాంటి నిర్మాణ అనుమ‌తులు లేకుండా నిర్మిస్తున్న‌ట్టు గుర్తించింది. దీంతో బుధ‌వారం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇంటిని తొల‌గించింది. 20 ఫీట్ల ర‌హ‌దారిని క్లియ‌ర్ చేసింది. ఇప్పుడు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అవ‌కాశం ల‌భించిద‌ని స్థానికులు తెలిపారు.

-న్యూ బోయిగూడ‌లో దారి చూపిన హైడ్రా

-రోడ్డుమీద నిర్మిస్తున్న ఇంటిని తొల‌గించిన హైడ్రా

సికింద్రాబాద్‌, బ‌న్సీలాల్‌పేట విలేజ్‌లోని న్యూ బోయిగూడ నివాసితుల‌కు హైడ్రా దారి చూపింది. 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మిస్తున్న ఇంటిని తొల‌గించి మార్గం సుగ‌మం చేసింది హైడ్రా.

సిమెంట్ రోడ్డు వేసి రాక‌పోక‌లు సాగిస్తున్నా ప‌ట్టించుకోకుండా 20 అడుగుల ర‌హ‌దారిని 10 అడుగుల మేర 50 గ‌జాల వ‌ర‌కూ ఆక్ర‌మించేసి కింద‌న షాపు, పైన నివాసం ఉండేలా ఇంటి నిర్మాణాన్ని చేప‌ట్ట‌డంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యా దు చేశారు.

గ‌తంలో చిన్న డ‌బ్బా పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే తాము ఏదో జీవ‌నోపాధి పొందుతున్నాడ‌ని వ‌దిలేస్తే.. ఇప్పుడు దారిని బంద్ చేస్తూ ఏకంగా ఇంటిని నిర్మిస్తున్నార‌ని.. ఈ విష‌యాన్ని జీహెచ్ ఎంసీకి కూడా ఫిర్యాదు చేశామ‌ని స్థానికులు పిర్యాదులో పేర్కొన్నారు.

ఎంత వారించినా ప‌ట్టించుకోకుండా ఇంటి నిర్మాణం చేప‌డుతున్నార‌ని.. వెంట‌నే ఆపాల‌ని హైడ్రాను ఆశ్ర‌యించారు. 20 అడుగుల ర‌హ‌దారి 10 అడుగుల మేర ఆక్ర‌మ‌ణ‌కు గురి కావ‌డంతో వాహ‌నాలు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

దీంతో వెనుక ఉన్న ఇళ్ల‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారి కూడా లేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు సంబంధిత అధికారుల‌తో హైడ్రా విచారించి.. ర‌హ‌దారిగా నిర్ధారించింది. ఎలాంటి నిర్మాణ అనుమ‌తులు లేకుండా నిర్మిస్తున్న‌ట్టు గుర్తించింది.

దీంతో బుధ‌వారం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇంటిని తొల‌గించింది. 20 ఫీట్ల ర‌హ‌దారిని క్లియ‌ర్ చేసింది. ఇప్పుడు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అవ‌కాశం ల‌భించిద‌ని స్థానికులు తెలిపారు.

హైడ్రా వ‌చ్చి ఆక్ర‌మ‌ణ‌ను తొల‌గించ‌డంతో 20 అడుగుల దారి త‌మ‌కు అందుబాటులోకి వ‌చ్చింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button