పోడు భూమి సాగుకు రూ.30 వేలు లంచం
ప్రధాన నిందితుడు బానోత్ రవికుమార్ లంచం డిమాండ్ చేయడంతో పాటు, తన తరఫున సాదిక్ ఖాన్ ద్వారా నగదు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టారు.

.. ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్!
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 4, నిజం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలంలో నిన్న (సెప్టెంబర్ 3న) లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మధ్యవర్తి ఏసీబీ అధికారులకు చిక్కారు.
కాచనపల్లి బీట్ ఫారెస్ట్ ఆఫీసర్, రామానుజగూడెం బీట్ ఇన్చార్జ్ బానోత్ రవికుమార్ పోడు భూమిలో సాగు చేసుకుంటున్న ఫిర్యాదుదారుడికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తాను నేరుగా లంచం తీసుకోకుండా పఠాన్ సాదిక్ ఖాన్కు నగదు ఇవ్వాలని రవికుమార్ సూచించారు. దీంతో ఫిర్యాదుదారు నిన్న రామానుజగూడెం గ్రామంలోని సాదిక్ ఖాన్ నివాసంలో రూ.30 వేల లంచాన్ని అందజేశారు.
అప్పటికే పక్కా ప్రణాళికతో ఉన్న ఏసీబీ అధికారులు సాదిక్ ఖాన్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతని చేతులకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చింది. లంచం మొత్తాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు బానోత్ రవికుమార్ లంచం డిమాండ్ చేయడంతో పాటు, తన తరఫున సాదిక్ ఖాన్ ద్వారా నగదు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టారు.
శ్రీనివాస్ నాయక్-
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



