గిరిజన గురుకులాల్లో 20 పార్ట్‌టైమ్ పోస్టులు.. అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నియామకానికి సంబంధించిన ఇతర వివరాల కోసం 7382931512, 7901099787 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

మహబూబాబాద్, ఆగస్టు 13 (నిజం న్యూస్): మహబూబాబాద్ రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక (పార్ట్‌టైమ్) ప్రాతిపదికన బోధన సిబ్బంది నియామకానికి అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ తోప్పో, IAS, ప్రాంతీయ సమన్వయ అధికారి (FAC) బి.ఏ.ఎల్. నారాయణ నాయక్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
మొత్తం 20 పార్ట్‌టైమ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళల విభాగంలో 13 పోస్టులు ఉండగా, వీటిలో TGT విభాగంలో గణితం 2, ఫిజిక్స్ 1, బయోసైన్స్ 1, సోషల్ 2 పోస్టులు ఉన్నాయి. PGT విభాగంలో ఇంగ్లీష్ 2, ఫిజిక్స్ 2 పోస్టులు, JL విభాగంలో కెమిస్ట్రీ 1, సివిక్స్ 1 పోస్టు, DL విభాగంలో కంప్యూటర్ సైన్స్ 1 పోస్టు ఉన్నాయి.
జనరల్ విభాగంలో మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో TGT విభాగంలో గణితం 1, ఫిజికల్ సైన్స్ 1, PGTలో బయోసైన్స్ 1, JLలో గణితం 1, కామర్స్ 1 పోస్టులు ఉన్నాయి. ఇతర విభాగంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1, PD 1 పోస్టు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో ఆగస్టు 14, 2026 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 22, 2026 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పని దినాల్లో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తులను ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం (గురుకులం), RDC ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, మహబూబాబాద్‌లో స్వీకరిస్తారు.
అభ్యర్థుల ఎంపిక డెమోలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. డెమోను ఆగస్టు 25, 2026 మంగళవారం ఉదయం 10 గంటలకు TGTWURJC (బాలుర) మహబూబాబాద్‌లో, ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, ఇందిరానగర్ కాలనీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహిళా గురుకుల విద్యాలయాల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఖాళీల సంఖ్యను పెంచడం, తగ్గించడం లేదా ఈ నియామక ప్రకటనను పూర్తిగా రద్దు చేసే అధికారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి ఉంటుందని వెల్లడించారు.
నియామకానికి సంబంధించిన ఇతర వివరాల కోసం 7382931512, 7901099787 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో
నిజం న్యూస్



