ఆర్టిఓ వెంకన్న మృతి విచారణ ప్రారంభం.

ఆర్టిఓ వెంకన్న మృతి విచారణ ప్రారంభం.
భూపాలపల్లికి చేరిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ చంద్రశేఖర్ గౌడ్.
విచారణలో పోలీస్ అధికారులతో ప్రాథమిక దర్యాప్తు వివరాలు.
లారీ డ్రైవర్, ఓనర్ హార్వెస్టర్ డ్రైవర్ ను విచారించిన జైట్ కమిషనర్.
జెన్కో కార్యాలయానికి చేరి, బొగ్గు లారీ వివరాలు,
సంఘటన స్థలం వద్ద పరిశీలన, ప్రత్యక్ష సాక్షుల కు విచారించిన కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్.
కమిషన్ భూపాల్ పల్లి విచారణతో అలజడి.
భూపాలపల్లి మహాదేవపూర్ జూన్ 24 (నిజం న్యూస్)
విధి నిర్వహణ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీవో వెంకన్న సంఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ కొరకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జై ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ సోమవారం రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధవారం రోజు జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ విచారణ కొరకు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి సమగ్రా విచారణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
విచారణలో పోలీస్ అధికారులతో ప్రాథమిక దర్యాప్తు వివరాలు.
విచారణ అధికారి చంద్రశేఖర్ గౌడ్ భూపాలపల్లికి చేరుకోగా మొదట ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సంఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు వివరాలను, సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ ల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం సంఘటనకు పాల్పడ్డ టిప్పర్ లారీ డ్రైవర్ మరియు ఓనర్ తో పాటు హార్వెస్టర్ డ్రైవర్లను కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ విచారించడం జరిగింది. అనంతరం అక్కడి నుండి బొగ్గు సరఫరా నిర్వహించి జెన్కో కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన టిప్పర్ లారీ లో సంఘటన జరిగిన రోజు ఉన్నటువంటి బొగ్గు వివరాలు తెలుసుకోవడం జరిగింది.
జెన్కో కార్యాలయానికి చేరి, బొగ్గు లారీ వివరాలు.
ప్రత్యేక అధికారి కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. సంఘటన జరిగిన సన్నివేశాలను రీసెంట్ క్రియేషన్ చేసి అలాగే సంఘటన జరిగిన పరిస్థితులను విశ్లేషించారు. సమీపంలో ఉన్న సిసి ఫోటో జీ లను కూడా విచారణ అధికారి చంద్రశేఖర్ పరిశీలించడం జరిగింది. అలాగే బొగ్గు లోడింగ్ పైట్ అయిన దాడిచర్లకు వెళ్లి. ఓపెన్ కాస్ట్ ప్రతినిధులతో సమావేశమై సంఘటన జరిగిన రోజు ఆ లారీ లోడ్ రికార్డు తదితర వివరాలను కూడా కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ పరిశీలించడం జరిగింది.ఈ విచారణ కార్యక్రమంలో, పోలీస్ శాఖ అధికారుల తో పాటు జిల్లా రవాణా శాఖ అధికారులు ఉన్నారు.
కమిషన్ భూపాల్ పల్లి విచారణతో అలజడి.
48 గంటలు గడవక ముందే విచారణ అధికారి జిల్లా కేంద్రానికి చేరి ఆర్టిఓ వెంకన్న మృతి, సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయడం, సంఘటన స్థలం నుండి మొదలుకొని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ వరకు వెళ్లి లోడింగ్ రవాణా లారీ లోని బొగ్గు వివరాలు, సంఘటన సీన్ రీకాల్, సి సి ఫుటేజ్ ల పరిశీలన,తో జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆర్టీవో సంఘటన పై అలజడి ప్రారంభమైంది. ఒక జిల్లా స్థాయి అధికారి సంఘటనలో మృతి చెందడాన్ని, సాధారణ దుర్ఘటనగా పరిగణించే పరిస్థితి లేదని గత మూడు రోజుల నుండి ప్రజలు మరియు సామాజిక మాధ్యమాల్లో, ఇది ముమ్మాటికి కోల్ మాఫియా హత్య ఏ నని, నిర్భయంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై తీసుకున్న తక్షణ చర్యలకు కూడా, హర్షిస్తున్నారు జిల్లావాసులు. ప్రత్యేక విచారణ అధికారి సమగ్ర విచారణలు రవాణా అధికారి మృతి ఘటన లేక ఇంకేమైనా ఉందా అనే విషయాలు విచారణ అనంతరం తేలలున్నాయి.



