Urea: అధిక ధరలకు యూరియా అమ్మకాలు..! బస్తాపై అదనంగా రూ. 70 నుండి రూ.100 రూ వసూలు.

Urea: మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామం లోని శ్రీ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ షాపులో యూరియా ఎమ్మార్పీ ధరల కంటే 70 నుంచి 100 రూపాయలు అధిక ధరలకు రైతుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు .

Urea:

అధిక ధరలకు యూరియా అమ్మకాలు..! 

ఎమ్మార్పీ ధరల కంటే  రూ. 70 నుంచి రూ. 100 లకు అమ్మకాలు

ఇదేందని అడిగితే మా ఇష్టం అంతే అంటున్న వైనం

రైతులకు యూరియా అందక ఒకపక్క ఇబ్బంది పడుతుంటే రైతుల ఇబ్బందులను ఆసరాగా తీసుకొని ఫెర్టిలైజర్స్ దుకాణదారులు ఒక్కో బస్తాపై రైతుల నుండి 70 నుండి100 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు

గురువారం మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామం లోని శ్రీ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ షాపులో యూరియాను తీసుకోవడానికి వెళ్లిన రైతుల వద్ద ఎమ్మార్పీ ధరల కంటే 70 నుంచి 100 రూపాయలకు రైతుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు .

రూ. 270లకు అమ్మకుండా ఇది ఏంటి అని ప్రశ్నించిన రైతులను మా ఇష్టం ఇలాగే అమ్ముతాం ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే తీసుకోకండి అని రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నరని తెలుపుతున్నారు.

మేము ఎవరికీ భయపడం…

గట్టిగా అడిగిన రైతులని మేము ఎవరికి భయపడం ఎక్కడంటే అక్కడ చెప్పుకోండి మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అని రైతులని బెదిరిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్స్ ఏజెన్సీ ప్రోప్రైటర్. వీరితోపాటు  రామాపురం లో కూడా లక్ష్మీ గణపతి అనే ఫెర్టిలైజర్ షాప్ లో  కూడా ఎమ్మార్పీ ధరల కంటే 70 నుంచి 100 రూపాయలు  అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు

బిల్లులు ఒక రేటు చెల్లించేది మరో రేటు…

రైతులకు ఇచ్చే బిల్లులో ఒక రేటు చెల్లించేటప్పుడు మరో రేటు తీసుకుంటున్నారు. రైతుల నుండి అక్రమంగా అధిక ధరలు వసూలు చేస్తున్న ఫర్టిలైజర్స్ దుకాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సదరు ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు యూరియాను అమ్ముతున్నారని కొంతమంది రైతులు మేళ్లచెరువు ఏవో కు ఫిర్యాదు చేయగా ఆమె వచ్చి విచారణ చేపట్టి అధిక ధరలకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎమ్మార్పీ కే అమ్మాలి..

ఎమ్మార్పీ ధరలకే యూరియా ను అమ్మాలని అంతకంటే ఎక్కువగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button