కృష్ణానదిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు ?

మంగళవారం ఉదయం తల్లి మిర పకాయలు కోసేందుకు వెళ్లడంతో సోదరులు గేదెలను మేపేందుకు కృష్ణానదీ తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు నదిలో గల్లంతైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

చింతలపాలెం, మార్చి 11 (నిజం న్యూస్ ) : సూర్యాపేట జిల్లా చింతలపాలెం
మండలం చింత్రియాల గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది.

కృష్ణానదీ తీరానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు గల్లంతు అయినట్లు భావిస్తున్నారు.

రంజాన్ సెల వులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు గల్లంతైనట్లు అనుమానిస్తుండటంతో కుటుం బసభ్యుల రోదనలు మిన్నంటాయి.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం గ్రామా నికి చెందిన సైదాహుస్సేన్ కుమారులు సమీర్, సద్దాంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఉర్దూ పాఠశాలలో విద్యనభ్యసిస్తు న్నారు.

రంజాన్ మాసం కావడంతో పాఠశాలకు సెలవులు ప్రకటించారు. దీంతో ఇటీవల స్వగ్రామం చింత్రియాలకు వచ్చారు.

మంగళవారం ఉదయం తల్లి మిర పకాయలు కోసేందుకు వెళ్లడంతో సోదరులు గేదెలను మేపేందుకు కృష్ణానదీ తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు నదిలో గల్లంతైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

మధ్యాహ్నం నుంచి పిల్లల ఆచూకీ లభించకపో వడంతో అప్రమత్తమైన గ్రామస్థులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేప ట్టారు.

మంగళవారం పొద్దుపోయే వరకు వారి జాడ లభించలేదు. రాత్రి గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.

ప్రతిరోజూ తల్లి గేదెలను మేపేందుకు వెళ్లేంది. పాఠశాలకు సెలవు రావడంతో ఇద్దరు పిల్లలు వెళ్లి అదృశ్యమయ్యారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button