బీరువాలోని నగలతో పాటు… వాటిని కూడా వదలని దొంగలు
బీరువాను పగులగొట్టి అందులో దాచుకున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు, వెండి వస్తువులను దొంగలించారు. పోతూ పోతూ ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె, గ్యాస్ సిలిండర్ను కూడా వదలకుండా దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో హైవే పక్కనే ఉన్న మసీదులో జరిగిన దొంగతనంలో బీరువాలో నగదు, బంగారం, వెండితో పాటు కందిపప్పు, ఉల్లిగడ్డలు, గ్యాస్ సిలిండర్లను కూడా ఎత్తుకుని పోవడం దారుణం.
మసీదులో మౌజమ్గా పనిచేస్తూ భార్యతో కలిసి మసీదు ఆవరణలోనే కమాలుద్దీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో దంపతులిద్దరూ బయటకు వెళ్లిన సమయంలో ఇంటికి వేసిన తాళం పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
బీరువాను పగులగొట్టి అందులో దాచుకున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 10 వేల నగదు, వెండి వస్తువులను దొంగలించారు. పోతూ పోతూ ఉల్లిగడ్డలు, కందిపప్పు, వంటనూనె, గ్యాస్ సిలిండర్ను కూడా వదలకుండా దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.



