హుజూర్‌ నగర్ లో దొంగ బంగారం బిస్కెట్ల కలకలం..!

ఒక ప్రైవేట్ బ్యాంక్ సంస్థలో పనిచేసే శివ అనే వ్యక్తి, హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి కొంత కాలంగా డబ్బులు బాకీ ఉన్నాడు. బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, శివ తన దగ్గర నగదు లేదని, దానికి బదులుగా బంగారు బిస్కెట్లు ఉన్నాయని నమ్మబలికాడు.

హుజూర్‌నగర్‌లో ‘దొంగ బంగారం’ కలకలం:

నమ్మించి ముంచిన బ్యాంక్ ఉద్యోగి, షాపు యజమాని..!

 

నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగడతారా.!

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో నకిలీ బంగారం బిస్కెట్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అప్పు తీర్చమంటే బంగారు బిస్కెట్లు ఇచ్చి మోసం చేసిన ఘటనలో ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి, స్థానిక జ్యువెలరీ షాపు యజమాని పాత్రపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ బ్యాంక్ సంస్థలో పనిచేసే శివ అనే వ్యక్తి, హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి కొంత కాలంగా డబ్బులు బాకీ ఉన్నాడు. బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, శివ తన దగ్గర నగదు లేదని, దానికి బదులుగా బంగారు బిస్కెట్లు ఉన్నాయని నమ్మబలికాడు.

నమ్మకం కుదిరేలా చేయడానికి, శివ బాధితుడిని పట్టణంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపుకు తీసుకువెళ్లాడు. అక్కడ తన వద్ద ఉన్న రెండు బిస్కెట్లను (సుమారు 100 గ్రాములు) బాధితుడికి అప్పగించాడు.

ఈ క్రమంలో సదరు జ్యువెలరీ షాపు యజమాని కూడా శివ తనకు డబ్బులు ఇవ్వాలని పేర్కొంటూ, ఈ బిస్కెట్ల వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించడం గమనార్హం.

బిస్కెట్లు తీసుకుని ఇంటికి వెళ్లిన బాధితుడు, అనుమానం వచ్చి వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా.. అవి అసలు బంగారం కాదని, దొంగ బంగారం (నకిలీ) అని తేలింది.

దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధితుడు, తనను బ్యాంక్ ఉద్యోగి మరియు జ్యువెలరీ షాపు యజమాని కలిసి పథకం ప్రకారం మోసం చేశారని గ్రహించాడు.

 

జ్యువెలరీ షాపు ముందు బైఠాయింపు

మోసపోయానని తెలుసుకున్న బాధితుడు, తన అనుచరులతో కలిసి సదరు జ్యువెలరీ షాపు ముందు బైఠాయించి నిరసన చేపట్టాడు. షాపు యజమాని, శివ ఇద్దరూ కుమ్మక్కై తనకు నకిలీ బిస్కెట్లు అంటగట్టారని బాధితుడు ఆరోపించారు. ఈ క్రమంలో షాపు వద్ద ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

 

నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగడతారా..? సామాన్యులను మోసం చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button