ఆవును చంపిన క్రూర మృగం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిధిలోని శారజీపేట గ్రామంలో అడవి క్రూర మృగం దాడి కలకలం రేపింది.గ్రామానికి చెందిన రైతు దూడల శ్రీధర్‌కు చెందిన ఆవును క్రూర మృగం దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పశువైద్య అధికారి డా.జానయ్య,ఆలేరు పశువైద్యాధికారి డా.చైతన్య గ్రామ సర్పంచ్,అటవీశాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

– సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.

ఆలేరు ఫిబ్రవరి 4 (నిజం చెపుతాం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిధిలోని శారజీపేట గ్రామంలో అడవి క్రూర మృగం దాడి కలకలం రేపింది.గ్రామానికి చెందిన రైతు దూడల శ్రీధర్‌కు చెందిన ఆవును క్రూర మృగం దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పశువైద్య అధికారి డా.జానయ్య,ఆలేరు పశువైద్యాధికారి డా.చైతన్య గ్రామ సర్పంచ్,అటవీశాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

మృగం దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పశువు మృతి పరిస్థితులను వివరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇటీవల అడవి ప్రాంతాల సమీప గ్రామాల్లో క్రూర మృగాల సంచారం పెరిగినట్లు సమాచారం అందుతున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో పశువులను పొలాల్లో లేదా బయట ప్రదేశాల్లో వదిలేయకుండా ఇంటి వద్ద లేదా భద్రత కలిగిన గోశాలలో ఉంచాలని సూచించారు. పశువుల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలను కొంతవరకు నివారించవచ్చని తెలిపారు.

అలాగే గ్రామ ప్రజలు క్రూర మృగాల సంచారం గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రైతులకు అవసరమైన సహాయం అందించేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, అధికారులు గ్రామ ప్రజలకు ధైర్యం చెబుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button