రైతు బజార్లో రైతేడి…. అంతా దళార్ల దోపిడీయే…!

1975 మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రహదారిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని అనంతరం రైతు బజార్‌గా మార్చి, రహదారిని 40 అడుగులకు కుదించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, రవాణా అంతరాయం, అత్యవసర సేవలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని విమర్శించారు

షాపు పన్నులు బాదుడు మాకు… అక్రమ దారుల వ్యాపారాలకు లాభాలు …

 

– ప్రస్తుతం రైతులకన్నా దళారుల సంఖ్య పెరిగి పోయిందనే విమర్శలున్నాయి.

 

– దేశానికి రైతే రాజు వెన్నుముక్క అంటారు… అయితే రైతు బజార్లో రైతే కరువు….

దళారుల హవా తో సామాన్య ప్రజల జేబులకు చిల్లు.*

 

– దళారుల వ్యవస్థ ముడుపుల మత్తులో ఎస్టేట్ ఆఫీస్ ఆఫీసుకు దారి కరువు.

 

కాకినాడ, ఫిబ్రవరి 27 (నిజం ప్రతినిధి):

 

కాకినాడ నగర నడిబొడ్డున ఉన్న కాకినాడ రైతు బజార్ సమస్య మరోసారి రాజకీయం, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వచ్చే మార్చి 10వ తేదీ లోపు రైతు బజార్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్‌బాబు ప్రభుత్వ యంత్రాంగానికి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు.

గత రెండు దశాబ్దాలుగా రైతు బజార్ నిర్వహణ పేరుతో స్థానిక నివాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

1975 మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రహదారిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని అనంతరం రైతు బజార్‌గా మార్చి, రహదారిని 40 అడుగులకు కుదించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, రవాణా అంతరాయం, అత్యవసర సేవలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని విమర్శించారు.

ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు సురక్షితంగా రాకపోకలు చేయలేని పరిస్థితి నెలకొనడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.

స్థానిక ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని ఆరోపించారు.

రైతుల కోసం ఏర్పాటు చేసిన బజార్‌లో నిజమైన రైతు కనబడడంలేదని, దళారులు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి.

ఎస్టేట్ ఆఫీసర్ కనుసన్నల్లో అక్రమ కేటాయింపులు, చిన్నచిన్న స్థలాలకు భారీ ముడుపులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని అన్నారు. కనీసం ఎస్టేట్ ఆఫీసర్ ఆఫీసులోకి వెళ్లడానికి కూడా దారి లేని పరిస్థితిలో దళార్ల షాపులు దర్శనమిస్తున్నాయి..

ఎస్టేట్ ఆఫీసర్ తనను ఎవరు ఏమి చేయలేరు నాకు మినిస్టర్ల పలుకుబడి చూపించుకుంటూ వ్యవహార శైలి పలువురులో దుమారం లేపుతుంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో చైర్మన్ బెండ విష్ణు వారానికి ఒక్కసారైనా రైతుబజార్ను సందర్శించి సమస్యలను పరిష్కరించే వారిని. . దళారి వ్యవస్థ ఆయన చూస్తే భయపడే విధంగా విధి నిర్వహణ నిర్వహించే వారిని పలువురు ప్రశంసించేవారు.

.ఇప్పటి చైర్మన్ ఇప్పటివరకు కనీసం రైతు బజార్ రైతు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారని పలువురు వాపోతున్నారు..ఇక రాజకీయ కోణంలో కూడా ఈ అంశం వేడెక్కింది.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ రైతు బజార్ విషయంలో రూరల్ ఎమ్మెల్యే జోక్యం ఎందుకని ప్రశ్నించడం ద్వారా అంతర్గత రాజకీయ ఉద్రిక్తతలపై కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు.

ప్రజా సమస్య పరిష్కారం కంటే అధికార, అవినీతి ప్రయోజనాలే ముందున్నాయా? అనే ప్రశ్నలు స్థానిక వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మొత్తంగా మార్చి 10ను డెడ్‌లైన్‌గా నిర్ణయిస్తూ, ఆ తేదీ లోపు రహదారి విస్తరణ, ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదల, అక్రమ కేటాయింపులపై విచారణ, దళారుల తొలగింపు వంటి చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి భారీ స్థాయిలో ఆందోళన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భాస్కర్ గణేష్‌బాబు స్పష్టం చేశారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పరిపాలన ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు కాకినాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button