TELANGANA : పేదల చాటున పెద్దలు కబ్జా
మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 1152లో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ సర్వే నెంబర్ లో 1954 నుండి 2016 వరకు కాస్రా పహాని,చెస్సాల పహాని లో రాజారామ్ కరణ్ పేరు మీద నమోదయి ఉన్నది.

ఇర్విన్ లో సర్వే నెంబర్ 1152 లో ఏమి జరుగుతుంది
అసలు ఆ భూమికి వారసులు ఎవరు…
ఆ భూమికి సంబంధం లేని వ్యక్తులకు పేరు మార్పిడి ఎలా జరిగింది…
అధికారుల తప్పిదామా…. నాయకుల ప్రమేయమా ….
అసలు ఇర్విన్ రెవెన్యూలో ఏమి జరుగుతుంది…
మాడ్గుల ఫిబ్రవరి19(నిజం చెపుతాం): మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 1152లో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ సర్వే నెంబర్ లో 1954 నుండి 2016 వరకు కాస్రా పహాని,చెస్సాల పహాని లో రాజారామ్ కరణ్ పేరు మీద నమోదయి ఉన్నది.
మండల వ్యవస్థ ఏర్పడక ముందు మాడ్గుల మండలంలోని సమీప గ్రామాలకు కల్వకుర్తి తాసిల్దార్ కార్యాలయంలో రాజారామ్ కరణ్ అనే వ్యక్తి పట్వారి గిరి చేశారని గ్రామ పూర్వపు పెద్దలు చెప్పారు.
ఆయన మన ప్రాంతంలో విధులు నిర్వహించిన సమయంలో ఎక్కడైతే ఖాళీ వ్యవసాయ భూమి కనిపిస్తే అతని పేరు మీద నమోదు చేసుకున్నారని ఈ ప్రాంత పూర్వపు పెద్దలు చెప్పారు .
ఆ భూమిని ఇర్విన్ సమీప గ్రామాలైన దిల్ వార్ ఖాన్ పల్లి,అజిలాపూర్, నల్లచెరువు గ్రామాల బీద రైతులు ఆ పొలాలను సాగు చేసుకుని జీవనోపాధి పొందేవారు.అది అదునుగా భావించిన సమీప గ్రామాల పైరవి కారులు ఆ బీద రైతుల నుండి ధరణి వచ్చిన అనంతరం లక్షల రూపాయలు దండుకొని రాజారాంకరణ్ పేరు తొలగించి వారి పేర నమోదు చేయించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
అలా చేయగా మిగిలిన వందల ఎకరాల పొలాన్ని అధికారుల అండతో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి కబ్జాలు చేస్తున్నారని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ భూములను కాపాడి అందులో సాగు చేసుకుని జీవనోపాధి పొందే పేద రైతులకు అండగా నిలబడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఆ భూములపై అక్రమంగా కబ్జాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తారా? సాగు చేసుకుని జీవనోపాధి పొందే పేద రైతులకు అండగా నిలుస్తారా సంబంధిత రెవెన్యూ అధికారుల తీరుపై మండల ప్రజలు వేచి చూడాల్సిందే.



