దేవాలయాల దొంగలు దొరికారు

శనివారం రోజు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దేవాలయాలలో దొంగతనం చేసిన దొంగలు దొరికారు

 

హనుమంతుల గూడెం ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచలోహ విగ్రహం*

 

*కల్మలచెరువు అయ్యప్ప స్వామి దేవాలయంలో మైకు సెట్టు*

 

*ఆంజనేయ స్వామి విగ్రహం అమ్మడానికి వెళుతుండగా దొరికిన దొంగలు*

 

గరిడేపల్లి మార్చి 7 (నిజం చెపుతాం)

 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో దేవాలయాలలో దొంగలించిన సొమ్ముతో సహా దొంగలు దొరికారు.

శనివారం రోజు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దేవాలయాలలో దొంగతనం చేసిన దొంగలు దొరికారు.

గరిడేపల్లి ఎస్ ఐ చలికంటి నరేష్ అందించిన వివరాల ప్రకారం మట్టంపల్లి పి యస్ పరిధిలో ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాన్ని దొంగతనo చేసిన విషయం రోజు ఉదయం సమయంలో తన సిబ్బందితో గరిడేపల్లి గ్రామం నందు పెట్రోల్లింగ్ విధులు నిర్వహిస్తుండగా

బణోతు సైదు, మరియు జామ్ల తండా కు చెందిన భూక్యా నర్సింహా అను వారు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా అనుమానం వచ్చి పట్టుబడి చేసి వారి వద్ద ఉన్న సంచిని విప్పి చూడగా అందులో

ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహం ఉండగా ఎక్కడిది అని అడగా వారు తేదీ 05.03.2026 రోజున హనుమంతులగూడెం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం చేసినమని మిర్యాలగూడ పట్టణంలో అమ్ముటకు వెళ్తున్నామని చెప్పగా

వారిని విచారించగా అట్టి కేసుతో పాటు కల్మల్ చెరువు గ్రామంలోని అయ్యప్ప స్వామి గుడిలో ఆంప్లిప్లేయర్ కూడా దొంగలించినమని చెప్పినారు.

గతంలో బాణోతు సైదు హుజూర్ నగర్, మట్టంపల్లి, చింతలపాలెం, కూసుమంచి, మేళ్లచెరువు, పెనుగంచిప్రోలు, గరిడేపల్లి, అనంతగిరి పి ఎస్ పరిధిలలో మొత్తం 17 కేసులు కలవు.

1) బాణోతు సైదు తండ్రి బిక్కు, వయసు: 27 సం.రాలు లంబాడ, వృత్తి: టిప్పర్ డ్రైవర్ బక్కలచ్య తండా కామంచికుంట గ్రామం, మట్టంపల్లి మండలo

2) భూక్యా నర్సింహా తండ్రి సకృ, వయసు: 22 సం.రాలు, లంబడ, వృత్తి: ప్రైవేట్ జాబ్ జామ్ల తండా, మట్టంపల్లి మండలం వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హుజూర్నగర్ సిఐ చరమంద రాజు ముందు హాజరు పరచడం జరిగిందని ఎస్ ఐ తెలిపారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button