గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో కొత్త ప్రయోగం..?
గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పై ఉన్న బోర్డుకు పోలీస్ స్టేషన్ అని 70 శాతం రాసి పెట్టి దాని క్రింద 30 శాతం వేణు మ్యార్యేజ్ ఈవెంట్స్ అని రాసి ఉంది. రెండో బోర్డు అంటే స్టేషన్ ముందు ఉన్న బోర్డులో 70 శాతం పోలీస్ స్టేషన్ అని రాసి మిగిలిన 30 శాతం మాక్స్ క్యూర్ హస్పిటల్ అని రాసి ఉంది. అంటే దాతల సహయంతో ఈ బోర్డులను ఏర్పాటు చేసారు కదా. ఇది కొత్త ఆలోచనే కదా

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు కొత్త ప్రయోగానికి తెర లేపారు. ఈ ప్రయోగాన్ని తిలకించిన ప్రజలు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో కూడా ఇలా చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో కొంత మేరకు ఖర్చులు తగ్గించవచ్చని అనుకుంటున్నారు.
ప్రయోగమేమిటని అనుకుంటున్నారా..?

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కు రెండు బోర్డులు పోలీస్ స్టేషన్ అని రాసి ఉన్నాయి. ఇదేంటీ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇలాగే ఉంటాయి కదా అనుకుంటున్నారా కాదు ఇవి కాస్త కొత్తగా కలర్ పుల్ గా కనిపిస్తున్నాయి.
అవేమిటంటే పోలీస్ స్టేషన్ పై ఉన్న బోర్డుకు పోలీస్ స్టేషన్ అని 70 శాతం రాసి పెట్టి దాని క్రింద 30 శాతం వేణు మ్యార్యేజ్ ఈవెంట్స్ అని రాసి ఉంది. రెండో బోర్డు అంటే స్టేషన్ ముందు ఉన్న బోర్డులో 70 శాతం పోలీస్ స్టేషన్ అని రాసి మిగిలిన 30 శాతం మాక్స్ క్యూర్ హస్పిటల్ అని రాసి ఉంది. అంటే దాతల సహయంతో ఈ బోర్డులను ఏర్పాటు చేసారు కదా. ఇది కొత్త ఆలోచనే కదా

రాష్ట్రంలోని అన్ని స్టేషన్లలో ఇలా చేస్తే…
గరిడేపల్లి పోలీసులు చేసినట్లుగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లో చేస్తే పోలీస్ స్టేషన్ అని పెట్టే బొర్డుల ఖర్చు చాలా వరకు మిగిలి పోయే అవకాశం ఉందని, ఇలా అన్ని పోలీస్ స్టేషన్ లలో కూడా చేసేలా రాష్ట్ర, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని దీని వల్ల పోలీస్ స్టేషన్ బోర్డులు స్పాన్సర్ల సహాయంతో ఎంతో అందంగా, భారీగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ప్రభుత్వం కి ఖర్చు తగ్గించే విధంగా గరిడేపల్లి పోలీస్ లు కొత్త తరహాలో ఆలోచన చేపట్టారు. ఇలాంటి ప్రయోగం చేసిన అధికారులను ఖచ్చితంగా అభినందించాల్సిందే.




One Comment