పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో ఉచిత కంటి వైద్యశిబిరం

హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  బుధవారం అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ బాబు తెలిపారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు ఉచిత కంటి వైద్యశిబిరం

__ ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  బుధవారం అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ బాబు తెలిపారు.

మంగళవారం టౌన్ హాల్ లో కంటి వైద్యశిబిరం ఏర్పాట్లను కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు లు పరిశించారు.

అనంతరం వారు మాట్లాడుతూ…సర్కిల్ పరిధిలోని సిమెంట్ పరిశ్రమల ట్రాన్స్ పోర్ట్, లారీ అసోసియేషన్, ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లు కు ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన సీనియర్ కంటి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి ఉచితంగా మందులు కళ్ళ అద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button